Judicial Enquiry On TSPSC Chairman Mahender Reddy: తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం సుపరిపాలన దిశగా అడుగులు వేస్తుంది. ఇప్పటికే ఆరు గ్యారంటీల పథకం అమలుకు చిత్తశుద్దితో ముందుకు వెళ్తుంది. ఇప్పటికే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకం ప్రారంభించింది. అదే  విధంగా మరో రెండు పథకాలు అమలు చేసే దిశగా వెళ్తుంది. అదేవిధంగా సీఎం రేవంత్ సర్కారు నిరుద్యోగులకు ఉద్యోగాల కల్పన చేసే దిశగా టీఎస్పీఎస్సీని సమూలంగా ప్రక్షాళన చేశారు.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Read More: Kitchen Tips: వంటగదిలో బొద్దింకల బెడద ఎక్కువైందా? ఈ చిట్కాతో చెక్ పెట్టండి..


ఇటీవల తెలంగాణ మాజీ డీజీపీ మహేందర్ రెడ్డిని టీఎస్పీఎస్సీ చైర్మన్ గా నియమిస్తూ ఉత్తర్వులు జారీచేశారు. మరికొందరు సభ్యులను కూడా నియమించారు. ఈక్రమంలో మాజీ పోలీసులు బాసు కోట్ల రూపాయలు అక్రమంగా సంపాదించారని ఆయనపై అనేక ఆరోపణలు వచ్చాయి. దీనిలో భాగంగా... ఇటు బీఆర్ఎస్ ప్రభుత్వం తీవ్ర స్థాయిలో మండిపడుతుంది. వెంటనే టీఎస్పీఎస్సీ చైర్మన్ ను పదవి నుంచి తొలగించి జూడిషియల్ ఎంక్వైరీ చేయించాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు.


హైదరాబాద్ లో బంజారా హిల్స్ లో ఆయన మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో ఆమె మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ గతంలో మహేందర్ రెడ్డిని బూతులు తిట్టారని గుర్తుచేశారు. ఇప్పుడు ఆయనను తీసుకొచ్చి టీఎస్పీఎస్సీ చైర్మన్ గా నియమించారన్నారు.  అదే విధంగా సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రగీతం పై మాట్లాడటం హస్యాస్పదంగా ఉందన్నారు. తెలంగాణ తల్లి విగ్రహం నాలా ఉందని సీఎం  అన్నారు.


Read More: Rajinikanth - Lal Salaam: ఎన్నాళ్లకు ఎన్నాళ్లకు తలైవాకు డైలాగ్ కింగ్ డబ్బింగ్.. లాల్ సలాంకు స్పెషల్ అట్రాక్షన్..


నేను కూడా తెలంగాణబిడ్డనే కదా అని కౌంటర్ ఇచ్చారు. తెలంగాణలో ఎండకాలంకంటే ముందే కరెంట్ కోతలు ఎక్కువయ్యాయని అన్నారు. భాగ్యనగరంలో రోజు మూడు నుంచి నాలుగు గంటలు కరెంట్ కోతలు ఉంటున్నాయని ఆరోపించారు. విద్యుత్ సంస్థల్లో ఏపీ వాళ్లను డైరెక్టర్ లుగా నియామకాలపై, కవిత మండిపడ్డారు. అదే విధంగా తెలంగాణ అసెంబ్లీకి ఏపీ సలహదారులు ఎందుకని ఎమ్మెల్యే కవిత సీఎం రేవంత్ పై మరోసారి ఫైర్ అయ్యారు. 
 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link: https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu 


Apple Link: https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook