Telangana Budget Allocation 2023: తెలంగాణ రాష్ట్ర  బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి హరీష్‌రావు అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. రూ.2,90,396 కోట్లతో బడ్జెట్‌ను రూపొందించారు. ఈ ఏడాది ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో బడ్జెట్‌పై ప్రభుత్వం భారీ కసరత్తు చేసింది. టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్‌గా మారి జాతీయ రాజకీయాల్లో సత్తా చాటులని అనుకుంటున్న తరుణంలో ఈ బడ్జెట్ ఎంతో ప్రాధాన్యత సంతరించుకుంది. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఫిబ్రవరి మొదటి వారంలోనూ బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తెలంగాణ వార్షిక బడ్జెట్  2 లక్షల 90 వేల 396 కోట్ల రూపాయలు


- రెవెన్యూ వ్యయం 2 లక్షల 11 వేల 680 కోట్లు


- మూలధనం 37 వేల 525 కోట్లు


బడ్జెట్ కేటాయింపులు ఇలా..


- దళిత బంధుకు 17 వేల 700 కోట్లు కేటాయింపు 


- షెడ్యూల్ కులాల ప్రత్యేక ప్రగతి నిధి కింద రూ.36 వేల 750 కోట్లు


- షెడ్యుల్ తెగల ప్రత్యేక ప్రగతి నిధి కింద 15 వేల 233 కోట్లు


- నీటిపారుదల రంగానికి 26 వేల 885 కోట్లు


- విద్యుత్ రంగానికి 12 వేల 727 కోట్లు


- మైనారిటీ సంక్షేమం 2వేల 2వందల కోట్లు


- కళ్యాణ లక్ష్మి, షాదీ ముబరక్ 3 వేల 210 కోట్లు


- హరితహరం పథకానికి  1471 కోట్లు


- బీసీ సంక్షేమం కోసం 6 వేల 229 కోట్లు


- విద్యాశాఖ కు 19 వేల 93 కోట్లు 


- వైద్య శాఖకు 12 వేల 161 కోట్లు


- పంచాయతీ రాజ్ శాఖకు 31 వేల 426 కోట్లు


- రోడ్లు భవనాలకు 2 వేల 500 కోట్లు


- మున్సిపల్ శాఖకు 11 వేల 372 కోట్లు కేటాయింపు


[[{"fid":"261652","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"Telangana Budget Allocation","field_file_image_title_text[und][0][value]":"తెలంగాణ బడ్జెట్"},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"Telangana Budget Allocation","field_file_image_title_text[und][0][value]":"తెలంగాణ బడ్జెట్"}},"link_text":false,"attributes":{"alt":"Telangana Budget Allocation","title":"తెలంగాణ బడ్జెట్","class":"media-element file-default","data-delta":"1"}}]]


- హోంశాఖకు 9 వేల 599 కోట్లు


- పరిశ్రమల శాఖకు 437 కోట్లు


- వ్యవసాయ రంగానికి 26,831 కోట్లు


- డబుల్ బెడ్రూం ఇళ్ల పథకం కోసం రూ.12 వేల కోట్లు


- హైదరాబాద్ మెట్రో రైలు కోసం 1500 కోట్లు, పాతబస్తీ మెట్రో లైన్‌కు రూ.500 కోట్లు


- ప్రజా పంపిణీ వ్యవస్థకు రూ.3,117 కోట్లు


- రుణమాఫీ పథకానికి రూ.6385 కోట్లు


- ఆయిల్‌ ఫామ్‌ సాగుకు రూ.1000 కోట్లు


 



Also Read: IND Vs AUS: ఆసీస్-భారత్ టెస్ట్ సిరీస్.. ఈ ఐదుగురు ఆటగాళ్లపై ఓ లుక్కేయండి   


Also Read: Pervez Musharraf: గంగూలీకి ముషారఫ్ ఫోన్.. రెండు దేశాల మధ్య యుద్ధం జరుగుతుందని వార్నింగ్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook