తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల షెడ్యూల్
తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల షెడ్యూల్
హైదరాబాద్: ఈ నెల 22 నుంచి 25 వరకు తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరుగనున్నాయి. తాజాగా ఖరారైన షెడ్యూల్ ప్రకారం ఫిబ్రవరి 22న ఉదయం 11 గంటలకు శాసనసభలో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుండగా ఆ మరుసటి రోజున బడ్జెట్‌పై అసెంబ్లీలో చర్చ జరుగనుంది. 25న ద్రవ్య వినిమయ బిల్లుకు అసెంబ్లీ ఆమోదం తెలపనుంది.
బడ్జెట్ సమావేశాలకు మరో వారం రోజులే మిగిలివున్న నేపథ్యంలో ప్రగతి భవన్‌లో బడ్జెట్ రూపకల్పనపై సీఎం కేసీఆర్ అధికార యంత్రాంగంతో కలిసి సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ ప్రాధాన్యాలు, వివిధ సంక్షేమ పథకాలు, ప్రాజెక్టులకు అయ్యే వ్యయం తదితర అంశాలు ఈ సమీక్షలో చర్చకొచ్చినట్టు తెలుస్తోంది. సమీక్షలో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చేవిధంగా బడ్జెట్‌ను రూపొందించాల్సిన అవసరం ఉందన్నారు. ముఖ్యంగా పేదల సంక్షేమం కోసం, వ్యవసాయ రంగం కోసం అధిక మొత్తంలో నిధులు కేటాయించేలా బడ్జెట్‌ను రూపొందించాలని అధికారులకు సూచించారు.