NTR Awards: ఎన్టీఆర్ ఈ మూడుక్షరాల పేరు ఒక చరిత్ర. తెలుగు సినీ రంగంలో మకుటంలేని మహారాజుగా ఓ వెలుగు వెలిగిన తర్వాత రాజకీయాల్లో ప్రవేశించి తనదైన శైలిలో రాణించారు. అంతేకాదు విశ్వవిఖ్యాత నటసార్వభౌమ, పద్మశ్రీ డాక్టర్. నందమూరి . తారక రామారావు పేరిట సినిమా రంగంలో అన్ని విభాగాలలో మంచి ప్రతిభ కనబరిచిన  సినీ నటులకు నటీనటులకు ‘కళావేదిక ఎన్టీఆర్ ఫిల్మ్ అవార్డ్స్ 2024 ఈ నెల 29న జరగనుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ వేడుకు హైదారాబాద్ లోని ‘దసపల్లా’ హోటల్లో నంది అవార్డుల కార్యక్రమం అతిరథ మహారథుల సమక్షంలో జరగనుంది. "కళావేదిక" (R.V.రమణ మూర్తి గారు), " రాఘవి మీడియా"  ఆధ్వర్యంలో వైభవంగా ఈ అవార్డులు ఇవ్వనున్నారు. ఈ సందర్భంగా  వేడుకకు విశిష్ట అతిథిగా రావాలన్న మా ఆహ్వానాన్ని మన్నించి అంగీకరించినందుకు తెలంగాణ రాష్ట్ర  రోడ్లు, భవనాలు మరియు  సినిమాటోగ్రఫీ శాఖ మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసారు.


ఎన్టీఆర్ గారి మీద ఉన్న అభిమానంతోనే ఆయన ఈ కార్యక్రమానికి రావడానికి ఒప్పుకున్నారు. కావున ఈ నెల 29 న సినీ ప్రముఖులు, NTR అభిమానులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందింగా విన్నవించారు. ఎన్టీఆర్ విషయానికొస్తే.. ఆంధ్ర ప్రదేశ్ లో 3 మూడు సార్లు ముఖ్యమంత్రి అయ్యారు. నాల్గు సార్లు సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన ఘనత ఎన్టీఆర్ కు దక్కుతుంది. ఆ తర్వాత ఏపీలో నాల్గోసారి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే కదా.


Also Read: Pension Hike: ఆంధ్రప్రదేశ్ ప్రజలకు జూలై 1న పండగే.. ఒక్కొక్కరికి రూ.7 వేలు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter