CM KCR announces rs.1cr to Darshanam Mogilaiah: పద్మశ్రీ అవార్డు గ్రహీత, పన్నెండు మెట్ల కిన్నెర వాయిద్య కళాకారుడు దర్శనం మొగిలయ్యకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) భారీ నజరానా ప్రకటించారు. హైదరాబాద్‌లో నివాసయోగ్యమైన ఇంటి స్థలంతో పాటు ఇంటి నిర్మాణానికి అయ్యే ఖర్చు, ఇతరత్రా అవసరాల కోసం రూ.1 కోటి నగదును అందిస్తున్నట్లు ప్రకటించారు. శుక్రవారం (జనవరి 28) హైదరాబాద్‌లోని ప్రగతి భవన్‌లో దర్శనం మొగిలయ్యను సీఎం కేసీఆర్ శాలువాతో సత్కరించారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తెలంగాణ గర్వించదగ్గ గొప్ప  కళారూపాన్ని కాపాడుతున్న  మొగిలయ్య (Darshanam Mogilaiah) అభినందనీయుడని ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ ప్రశంసించారు. మొగిలయ్య పద్మశ్రీ అవార్డు రావడం పట్ల సీఎం సంతోషం వ్యక్తం చేశారు. మొగిలయ్యకు ఇచ్చే నజరానా, ఇంటి స్థలానికి సంబంధించిన విషయాలను చూసుకోవాల్సిందిగా ఎమ్మెల్యే గువ్వల బాలరాజును పురమాయించారు.


దర్శనం మొగిలయ్య కళను గుర్తించి తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే ప్రతీ నెల ఆయనకు గౌరవ వేతనాన్ని అందిస్తోందని కేసీఆర్ పేర్కొన్నారు. తెలంగాణ కళలను పునరుజ్జీవింపచేస్తామని... కళాకారులను గౌరవిస్తూ వారిని ఆదుకుంటామని అన్నారు. మొగిలయ్యను సీఎం సత్కరించిన సందర్భంగా మంత్రులు శ్రీనివాస్ గౌడ్, మల్లారెడ్డి, ఎమ్మెల్యే గువ్వల బాలరాజు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.


మొగిలయ్యకు తెలంగాణ ప్రభుత్వం అందించిన నజరానా పట్ల ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) హర్షం వ్యక్తం చేశారు. 'కళాకారులకు సమున్నత స్థానం కల్పించి ప్రోత్సాహించే కళాపిపాసి మన సీఎం కేసీఆర్ గారు. 12 మెట్ల కిన్నెర వాయిస్తూ, పద్మశ్రీ అందుకున్న తెలంగాణ బిడ్డ దర్శనం మొగిలయ్య గారికి ఇంటి స్థలంతో పాటు నిర్మాణానికి రూ.1 కోటి అందించి సత్కరించడం సీఎం కేసీఆర్ గారి గొప్ప మనసుకు నిదర్శనం.' అని కవిత తన ట్విట్టర్‌లో పేర్కొన్నారు.



కాగా, తన పూర్వీకుల ద్వారా పన్నెండు మెట్ల కిన్నెర వాయిద్య కళారూపాన్ని అందిపుచ్చుకున్న దర్శనం మొగిలయ్యకు (Darshanam Mogilaiah) ఆలస్యంగానైనా తగిన గుర్తింపు దక్కింది. తనది పేద కుటుంబ నేపథ్యం కావడంతో ఒకప్పుడు యాచకత్వం కోసమే మొగిలయ్య కిన్నెర వాయించాడు. రెండేళ్ల క్రితం తెలంగాణ ప్రభుత్వం అతని కళను గుర్తించి ప్రతీ నెలా కొంత గౌరవ వేతనాన్ని అందజేస్తోంది. ఇటీవలే పవన్ కల్యాణ్ హీరోగా తెరకెక్కుతోన్న 'భీమ్లా నాయక్' సినిమాలో పాట ద్వారా మొగిలయ్య పేరు ఒక్కసారిగా మారుమోగిపోయింది. తెలంగాణ ప్రభుత్వం కళారంగంలో ఆయన పేరును పద్మశ్రీ అవార్డుకు (Padma Awards) సిఫారసు చేయగా.. కేంద్రం ఇటీవలే ఆయనకు ఆ అవార్డును ప్రకటించింది.


Also Read: Budget 2022: త్వరలో తగ్గనున్న స్మార్ట్​ఫోన్స్​, ఇతర ఎలక్ట్రానిక్స్ ధరలు?


Also read: EPFO Money withdraw: ఉమంగ్ యాప్ ద్వారా కొవిడ్-19 అడ్వాన్స్ ఇలా డ్రా చేయండి..


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook