Telangana CM KCR discharged from Yashoda Hospital: స్వ‌ల్ప అస్వ‌స్థ‌త‌కు గురైన తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ సోమాజిగూడ‌లోని య‌శోద ఆస్ప‌త్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. కొద్దిసేపటి క్రితమే ఆసుపత్రి నుంచి బయటకు వచ్చిన సీఎం.. ప్రగతి భవన్‌కు చేరుకున్నారు. సీఎం ఆరోగ్యంగా ఉన్నార‌ని, ఎలాంటి ఆందోళ‌న చెందాల్సిన అవ‌స‌రం లేద‌ని య‌శోద ఆస్ప‌త్రి వైద్యులు డాక్ట‌ర్ ఎంవీ రావు స్ప‌ష్టం చేశారు. అయితే సీఎంకు వారం నుంచి పది రోజుల పాటు విశ్రాంతి అవసరం అని వైద్యులు చెప్పారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సీఎం కేసీఆర్‌కు గ‌త రెండు రోజుల నుంచి వీక్‌గా ఉండడం, ఎడమ చేయి నొప్పి రావడంతో స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. దాంతో వైద్య పరీక్షల కోసం సోమాజిగూడలోని యశోద హాస్పిటల్‌కు కుటుంబ సభ్యులతో వెళ్లారు. అక్కడ జనరల్ చెక్ అప్‌లోని అన్ని పరీక్షలతో పాటు సిటీ స్కాన్, ఎంజియోగ్రామ్, ఈసీజీ, 2డి ఎకో పరీక్షలు నిర్వహించారు. ఆయనకు అన్ని పరీక్షలు నిర్వహించిన వైద్యులు ఆరోగ్యంగా ఉన్నారని చెప్పారు . దీంతో ఆసుపత్రి నుంచి సీఎం డిశ్చార్జ్‌ అయ్యారు. ఆయన ప్రస్తుతం ప్రగతి భవన్‌కు చేరుకున్నారు. వారం రోజుల పాటు విశ్రాంతి తీసుకోనున్నారు. 


సీఎం కేసీఆర్‌ ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు మీడియాకు వివరించారు. కేసీఆర్‌ వ్యక్తిగత వైద్యుడు డా. ఎంవీ రావుతో పాటు మరికొందరు యశోద ఆస్పత్రి వైద్యులు వివరాలను తెలిపారు. 'ఈ ఉదయం 8 గంటల సమయంలో సీఎం కేసీఆర్ ఫోన్ చేశారు. ప్రగతి భవన్ వెళ్లి ఆయనను పరిశీలించాం. గత రెండు రోజులుగా అలసిపోయినట్లు చెప్పారు. ముఖ్యంగా ఎడమ చేయి నొప్పి ఉందన్నారు. పరీక్షల కోసం ఆస్పత్రికి రావాలని సీఎంకు సూచించాం. పరీక్షలు చేశాం. సర్వైకల్‌ స్పైన్‌ వల్ల నరంపై ఒత్తిడి పడి చెయ్యి నొప్పి వచ్చింది. వరుస పర్యటనలు, ఉపన్యాసాలు చేయడం వల్లే నీరసంగా ఉన్నారు' అని వైద్యులు చెప్పారు. 


'సీఎంకు యాంజియోగ్రామ్‌ నిర్వహిస్తే బ్లాక్స్‌ లేవని తెలిసింది. గుండె పనితీరు బాగానే ఉంది. గుండెకు సంబంధించిన పరీక్షలు సాధారణంగా ఉన్నాయి. ఆయనకు బీపీ, షుగర్‌ సాధారణంగా ఉన్నాయి. రక్త పరీక్షల్లోనూ ఎలాంటి సమస్యలు లేవు. వైద్య పరీక్షల తర్వాత 3-4 గంటలు అబ్జర్వేషన్‌లో ఉంచాం. మధ్యాహ్నం 3 గంటలకు సీఎంను డిశ్చార్జ్‌ చేస్తాం. వారం రోజులు విశ్రాంతి తీసుకోవాలని సూచించాం. మళ్ళీ వచ్చే సంవత్సరం పరీక్షలు నిర్వహిస్తాం' అని యశోద వైద్యుల బృందం తెలిపింది.
 


 Also Read: IPL 2022 MS Dhoni: మహీనా మజాకా.. చెన్నైలోనే కాదు సూరత్‌లోనూ తగ్గేదేలే (వీడియో)!!


Also Read: Punjab election result 2022: ఆప్​ జోరుకు కాంగ్రెస్​ విల విల- రెండు చోట్లా ఓడిన సీఎం చన్నీ


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook