CM KCR On Hyderabad Floods: వరదల వల్ల నష్టపోయిన ప్రతీ ఇంటికి రూ.10 వేలు
CM KCR About Hyderabad Floods| హైదరాబాద్ ( Hyderabad) నగరంలో కురిసిన వర్షాలతో పాటు, ఎగువ ప్రాంతాల నుంచి పోటెత్తి వచ్చిన వరద నీటి వల్ల ( Hyderabad Floods ) జనజీవనం అస్తవ్యస్తం అయింది. దానికి తోడు వానలు కురవడం ఇంకా ఆగలేదు. ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాల వల్ల అనేక కాలనీల్లో, బస్తీల్లో ప్రజలు బిక్కు బిక్కుమంటున్నారు.
Hyderabad Rain | హైదరాబాద్ ( Hyderabad) నగరంలో కురిసిన వర్షాలతో పాటు, ఎగువ ప్రాంతాల నుంచి పోటెత్తి వచ్చిన వరద నీటి వల్ల ( Hyderabad Floods ) జనజీవనం అస్తవ్యస్తం అయింది. దానికి తోడు వానలు కురవడం ఇంకా ఆగలేదు. ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాల వల్ల అనేక కాలనీల్లో, బస్తీల్లో ప్రజలు బిక్కు బిక్కుమంటున్నారు. తినడానికి తిండిలేక, తాగడానికి మంచి నీరు లేక ఇబ్బంది పడుతున్నారు. వారిని చేరి ఆదుకోవడానికి, సహాయం చేయడానికి ప్రభుత్వ యంత్రాంగాలు, స్బచ్ఛంద సంస్థలు తమవంతుగా ప్రయత్నిస్తున్నాయి.READ ALSO | Paytm Credit Cards:పేటీఎం క్రిడిట్ కార్డులు వచ్చేస్తున్నాయి
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ( CM KCR) వరద వల్ల నష్టపోయిన ప్రజలకు అండగా నిలుస్తానని తెలిపారు. పేద ప్రజల కోసం తక్షణమే రూ.550 కోట్లు రూపాయలు విడుదల చేస్తున్నట్టు తెలిపారు. వరద నీటి వల్ల నష్టపోయిన, లేదా ముంపునకు గురైన ప్రతీ ఇంటికి రూ.10 వేల సాయం అందిస్తామన్నారు.
వరదల వల్ల ఒక వేళ ఇళ్లు కూలిపోతే రూ. లక్ష ఆర్థిక సాయం చేస్తామని, పాక్షికంగా దెబ్బతిన్న వారికి రూ.50 వేలు అందిస్తాం అన్నారు. అదే సమయంలో వరదల వల్ల దెబ్బతిన్న మౌలిక సదుపాయాలను వీలైనంత త్వరగా మరమ్మత్తులు చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులకు సూచించారు సీఎం కేసీఆర్. ALSO READ | LPG Gas: గ్యాస్ సిలిండర్ బుక్ చేస్తున్నారా ? ఈ కొత్త రూల్ గురించి తెలుసుకోండి!
A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే ZEEHINDUSTAN App డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
IOS Link - https://apple.co/3loQYeR