KCR FIRE : కేంద్ర ప్రభుత్వంపై మరోసారి నిప్పులు చెరిగారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్. తెలంగాణపై మోడీ సర్కార్ వివక్ష చూపిస్తుందన్నారు. అయినా అన్ని రంగాల్లో తెలంగాణ దేశంలో నెంబర్ వన్ గా ఉందన్నారు కేసీఆర్. దేశ వాణిజ్య రాజధాని ముంబై కంటే తెలంగాణ తలసరి ఆదాయం ఎక్కువగా ఉందన్నారు. ఉద్యమ సమయంలో చెప్పిన మాటలన్ని నిజం అవుతున్నాయన్నారు. రాష్ట్రానికి కేంద్రం ఒక్క మెడికల్ కాలేజీ కూడా ఇవ్వడం లేదని ఆరోపించారు.
గత ఏనిమిది ఏళ్లలోనే 12 కొత్త మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేశామన్నారు. త్వరలోనే మొత్తం 33 జిల్లాల్లో మెడికల్ కాలేజీలు వస్తాయన్నారు ముఖ్యమంత్రి. 2014 వరకు రాష్ట్రంలో 2 వేల 4 వందల మెడికల్ కాలేజీ సీట్లు ఉంటే.. ఇప్పుడు 6 వేల ఏడు వందలకు పెరిగాయన్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

రాజకీయాల కోసమే కేంద్ర మంత్రులు రాష్ట్రానికి వచ్చి తనను తిడుతున్నారని కేసీఆర్ అన్నారు. కేంద్ర మంత్రులు ఇక్కడ విమర్శిస్తున్నారు.. ఢిల్లీలో అవార్డులు ఇస్తున్నారని చెప్పారు. కేంద్రమంత్రులు తిట్టిపోయిన మర్నాడే రాష్ట్రానికి జాతీయ స్థాయిలో అవార్డులు వస్తున్నాయన్నారు. దేశంలో ఏం జరుగుతుందో ప్రజలు గమనించాలన్నారు కేసీఆర్. కొందరు చిల్లరగా మాట్లాడుతూ మత విధ్వేషాలు రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నారని విమర్శించారు. 1956లో జరిగిన చిన్న పొరపాటు వల్ల 60 ఏండ్లు గోస పడ్డామన్నారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు.


వరంగల్ జిల్లాలో పర్యటించిన సీఎం కేసీఆర్ దామెరలో నిర్మించిన ప్రతిమ క్యాన్సర్ ఆస్పత్రిని ప్రారంభించారు. మంత్రులు హరీష్ రావు,ఎర్రబెల్లి దయాకరరావు, గంగుల కమలాకర్, సత్యవతి రాథోడ్, కొప్పుల ఈశ్వర్, వరంగల్ జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. ములుగు రోడ్డులోని ప్రతిమ ఆసుపత్రి కళాశాలను ప్రారంభించిన అనంతరం ముఖ్యమంత్రి పాత సెంట్రల్ జైలు ప్రాంతానికి వచ్చారు. జైలును కల్చివేసి నిర్మిస్తున్న సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి పనులను పరిశీలించారు. మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డితో కలిసి నిర్మాణ పనులపై కాంట్రాక్ట్ సంస్థ ప్రతినిధులతో మాట్లాడారు సీఎం కేసీఆర్.


Also Read : TRS VS YSRCP: టీఆర్ఎస్ ఫ్లెక్సీల్లో NTR.. హరీష్ పై ఏపీ మంత్రుల ఫైర్! కేసీఆర్, జగన్ మధ్య యుద్దమేనా?


Also Read : ఆచార్య విషయంలో అదే బాధ.. అందుకే రాజమౌళి సినిమాలో నటించను : చిరంజీవి



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి