Prashanth Kishor: తెలంగాణలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్ నేతలకు టెన్షన్ పట్టుకుంది. ఇప్పటికే బీజేపీ, కాంగ్రెస్ నేతలు ప్రజా క్షేత్రంలో తిరుగుతున్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతున్నారు. కేసీఆర్ సర్కార్ పై జనాల్లో తీవ్ర వ్యతిరేకత ఉందనే చర్చ సాగుతోంది. బీజేపీ, కాంగ్రెస్ కార్యక్రమాలతో ఇది మరింత పెరిగే అవకాశం ఉందని అంటున్నారు.ఈ టెన్షన్ ఉండగానే.. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు మరో సమస్య వచ్చి పడింది. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ గులాబీ లీడర్లకు గుబులు రేపుతున్నారు. ఈనెల 18న సీఎం కేసీఆర్ తో సమావేశం కాబోతున్నారు ప్రశాంత్ కిషోర్. దీంతో టీఆర్ఎస్ నేతలకు టెన్షన్ పెరిగిపోతోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ప్రశాంత్ కిషోర్ ప్రస్తుతం టీఆర్ఎస్ కు వ్యూహకర్తగా ఉన్నారు. కేసీఆర్ డైరెక్షన్ లో కొన్ని రోజులుగా పీకే టీమ్ తెలంగాణలో సర్వే చేస్తోంది. ఐ ప్యాక్ టీమ్ సభ్యులు క్షేత్రస్థాయిలో తిరుగుతూ ప్రజల నాడి తెలుసుకుంటున్నారు. తమ సర్వేలకు సంబంధించి ఇప్పటీకే కొన్ని నివేదికలు కేసీఆర్ కు ఇచ్చారు ప్రశాంత్ కిషోర్. తాజాగా ఈనెల 18న ముఖ్యమంత్రి కేసీఆర్ తో సమావేశం కాబోతున్నారు. ఈ భేటీలోనే తమ సర్వేలకు సంబంధించి తుది రిపోర్టును పీకే ఇస్తారని తెలుస్తోంది. సర్వేతో పాటు వచ్చే ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహలపై చర్చించనున్నారు. తెలంగాణలో ముందస్తు ఎన్నికలు వస్తాయనే ప్రచారం కొంత కాలంగా సాగుతోంది. పీకే సర్వే తర్వాత దీనిపై కేసీఆర్ నిర్ణయం తీసుకోనున్నారని అంటున్నారు.


ఇక పీకే రిపోర్టుకు సంబంధించి కొన్ని లీకులు వస్తున్నాయి. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై ప్రజల్లో వ్యతిరేకత బాగా ఉందని సర్వేల్లో తేలిందని అంటున్నారు. ముఖ్యంగా రెండు, మూడు సార్లు ఎమ్మెల్యేగా ఉన్నవాళ్ల పరిస్థితి దారుణంగా ఉందంటున్నారు. ప్రస్తుతం ఉన్న సిట్టింగులలో సగానికి పైగా ఎమ్మెల్యేలపై వ్యతిరేకత పీకే సర్వేల్లో తేలిందంటున్నారు. కొన్ని నియోజకవర్గాల్లో ఇది మరీ ఎక్కువగా ఉందంట. ఇప్పుడున్న ఎమ్మెల్యేల్లో దాదాపు 30 మందిని ఖచ్చితంగా మార్చాల్సిందేనని, లేదంటే పార్టీకి కష్టమని పీకే నివేదికలో ఉందంటున్నారు. వ్యతిరేకత కాస్త తక్కువగా నియోజకవర్గాల్లో పరిస్థితిని మెరుగుపరుచుకోవడానికి ఏం చేయాలన్న దానిపైనా పీకే నివేదికలో ఉందంటున్నారు.


కేసీఆర్ తో పీకే సమావేశం కానుండటంతో... తమ జాతకం ఎలా ఉందోనన్న ఆందోళనలో టీఆర్ఎస్ లీడర్లు ఉన్నారని తెలుస్తోంది. పీకే నివేదిక ఆధారంగానే వచ్చే ఎన్నికల్లో టికెట్లు ఇచ్చే అవకాశం ఉండటంతో.. తమ రిపోర్టు ఎలా ఉందోనని తెలుసుకునే ప్రయత్నాలు చేస్తున్నారట. పీకే టీమ్ సభ్యులను కొందరు సంప్రదిస్తున్నారని తెలుస్తోంది. మొత్తంగా బుధవారం జరగనున్న కేసీఆర్, పీకే సమావేశం.. టీఆర్ఎస్ నేతలకు నిద్ర పట్టకుండా చేస్తుందనే టాక్ తెలంగాణ భవన్ వర్గాల నుంచి వస్తోంది. చూడాలి మరీ పీకే రిపోర్ట్ ఎలా ఉండబోతోందో.. దాని పర్యవసానాలు టీఆర్ఎస్ పార్టీలో ఎలా ఉండబోతున్నాయో...


READ ALSO:Bandi Sanjay on PJR: తెలంగాణ బీజేపీ టార్గెట్ కాంగ్రెసేనా? పీవీ, పీజేఆర్ జపం అందుకేనా?


READ ALSO:Karate Kalyani: మరో వివాదంలో కరాటే కల్యాణి... ఆమెతో ప్రాణ భయం ఉందంటూ పోలీసులకు మరో వ్యక్తి ఫిర్యాదు


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook