CM Kcr Review: భారీ వర్షాలపై ప్రగతి భవన్‌లో మంత్రులు, అధికారులతో సీఎం కేసీఆర్ ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. సహాయక చర్యలపై చర్చించారు. ఇప్పటికే భారీ వర్షాలు, వరదలతో కొన్ని ప్రాంతాలు ముంపునకు గురయ్యాయి. ఈక్రమంలో అక్కడి పరిస్థితిపై అధికారులతో ఆరా తీశారు. ఏ ఏ జిల్లాల్లో ఎంత మేర వర్షం పడింది..సహాయక చర్యలు ఎలా ఉన్నాయన్న దానిపై చర్చించారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఎగువ ప్రాంతాల నుంచి భారీగా నీరు వస్తే..ముంపు ప్రజలను ఎలా తరలించాలన్న అంశంపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. మరోవైపు రాగల మూడు రోజులపాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. దీంతో నది పరవాహక ప్రాంతాలపై ప్రత్యేక నిఘా ఉంచారు. ముంపు ప్రాంతాల్లో ముందస్తు సీఎం కేసీఆర్ అప్రమత్తం చేశారు.


ఈక్రమంలో ముంపు ప్రాంతాల మంత్రులు, ప్రజాప్రతినిధులతో ఫోన్‌లో మాట్లాడారు. రాగల మూడు రోజులపాటు మరింత జాగ్రత్తగా ఉండాలని ఆదేశించారు. వరద తీవ్రతను బట్టి నడుచుకోవాలన్నారు. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని చర్యలు తీసుకోవాలన్నారు సీఎం కేసీఆర్. వరదల్లో ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా చూసుకోవాలని స్పష్టం చేశారు. 


మరోవైపు అన్ని జిల్లాల కలెక్టర్లతో సీఎస్ సోమేష్‌కుమార్ టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. భారీ వర్షాలపై ఆరా తీశారు. ఎట్టి పరిస్థితిల్లోనూ ప్రాణ నష్టం కల్గకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. భారీ వర్ష సూచన నేపథ్యంలో చేపట్టాల్సిన చర్యలపై చర్చించారు. విపత్తుల శాఖ అధికారులతో సమన్వయం చేసుకుంటూ పనిచేయాలని అధికారులకు స్పష్టం చేశారు.


Also read:IND vs WI: విండీస్ గడ్డపై టీమిండియా యువ ఆటగాడు అరుదైన రికార్డు..!


Also read:Rahul Gandhi on NDA: ఎన్డీఏ అంటే నో డేటా అవలైబుల్..కేంద్రంపై రాహుల్ గాంధీ సెటైర్లు..!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.