Holidays For Schools and Colleges In Telangana : హైదరాబాద్ : రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ, అతి భారీ వర్షాల నేపథ్యంలో రేపు బుధవారం, ఎల్లుండి గురువారం రెండు రోజుల పాటు తెలంగాణలోని స్కూల్స్, కాలేజీలు సహా అన్నిరకాల విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించాలని, అందుకు సంబంధించిన ఉత్వర్వులు తక్షణమే జారీ చేయాలని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఆదేశించారు.



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇది కూడా చదవండి : Telangana Rains: తెలంగాణలో వరుణుడి బీభత్సం.. భారీగా పంట నష్టం.. ఇవాళ, రేపు విద్యాసంస్థలకు సెలవులు..


ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు రాష్ట్ర విద్యా శాఖ రేపు, ఎల్లుండి రాష్ట్రంలోని అన్ని విద్యా సంస్థలకు సెలవులు జారీ చేస్తున్నట్టు ప్రకటించింది. అన్ని ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థలకు ఈ రెండు రోజులు సెలవులు వర్తిస్తాయని విద్యా శాఖ తమ ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ మేరకు గవర్నమెంట్ మెమో నెంబర్ 5104/Prog.II/A1/2023 పేరిట విద్యా శాఖ కార్యదర్శి వాకాటి కరుణ ఉత్తర్వులు జారీచేశారు.


ఇది కూడా చదవండి : Heavy Rains in Telangana: తెలంగాణలో భారీ వర్షాలు.. ఏ జిల్లా పరిస్థితి ఎలా ఉందంటే..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి