సూర్యాపేట: తీవ్ర నీటి ఎద్దడి సమస్య ఉండే సూర్యాపేట జిల్లాలోని చెరువులను గోదావరి జలాలతో నింపాల్సిందిగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన ఆదేశాల మేరకు ఇప్పటికే గత 20 రోజులుగా సూర్యాపేట జిల్లాలోని చెరువులకు గోదావరి నది జలాలను విడుదల చేస్తున్నారు. అయితే, ప్రస్తుతం నీటి ప్రవాహం ఎలా ఉంది? చెరువులు నిండుతున్నాయా ? లేదా ? ఇంకా ఎన్ని రోజులు నీటి విడుదల చేయాల్సి ఉందనే అంశాలపై సీఎం కేసీఆర్ సోమవారం ఆరా తీశారు. మంత్రి జగదీశ్ రెడ్డితో మాట్లాడి తాజా పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. 


ఇటీవల కురిసిన వర్షాల కారణంగా ప్రస్తుతం నీటికి కొరత లేదని, ఎన్ని రోజులైనా గోదావరి జలాలు విడుదల చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని సీఎం కేసీఆర్ మరోసారి స్పష్టంచేశారు.