Aasara Pensions: తెలంగాణ ఎన్నికల వేళ ముఖ్యమంత్రి కేసీఆర్..బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోను ఇవాళ విడుదల చేశారు. ఆంధ్రప్రదేశ్ తరహాలో రాష్ట్రంలో ఆసరా పింఛన్లను అమలు చేస్తామన్నారు. ఈ సందర్భంగా ఏపీలో ఎలా విజయవంతంగా అమలు చేస్తున్నారో వివరించారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తెలంగాణ ఎన్నికలకు సమయం సమీపిస్తోంది. ప్రధాన పార్టీలు ఎన్నికల మేనిఫెస్టోలు, అభ్యర్ధుల జాబితాలో నిమగ్నమై ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ ఇవాళ తొలి జాబితా 55 మందితో విడుదల చేసింది. మరోవైపు ఇవాళ అధికార బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోను ముఖ్యమంత్రి కేసీఆర్ విడుదల చేశారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో పింఛన్లను పెంచుతున్నట్టు తెలిపారు. ఆసరా పింఛన్లను 5 వేలకు పెంచుతామన్నారు. అయితే ఈ ఫించన్లను ఎలా పెంచుతామో వివరించే క్రమంగా ఏపీ ప్రస్తావన తీసుకొచ్చారు. ఏపీలో వైఎస్ జగన్ ప్రభుత్వం పింఛన్లను 2 వేల నుంచి 3 వేలకు పెంచిన వైనాన్ని గుర్తు చేశారు. అక్కడ ఏడాదికి 250 చొప్పున పెంచుతూ 3 వేలు చేస్తామని చెప్పి విజయవంతంగా అమలు చేస్తున్నారని చెప్పారు. 


అదే విధంగా తెలంగాణలో కూడా ఒకేసారి రాష్ట్ర ఖజానాపై భారం పడకుండా ఉండేలా పింఛన్ పెంచుకుంటూ పోతామన్నారు. ఒకేసారి ఆసరా పింఛన్ 5 వేలకు పెంచుతామని చెప్పడం లేదన్నారు. అదికారంలో వచ్చిన తొలి ఏడాది అంటే మార్చ్ తరువాత ఆసరా పింఛన్ ను 3 వేలకు పెంచుతామన్నారు. ఆ తరువాత ప్రతి యేటా 500 రూపాయలు పెంచుకుంటూ ఐదో ఏడాదికి 5 వేల రూపాయలు చెస్తామని కేసీఆర్ వివరించారు. ఏపీలో కూడా ఇలాగే విజయవంతంగా అమలు చేస్తున్నారని కేసీఆర్ ప్రస్తావించారు. 


అదే సమయంలో దివ్యాంగులకు ఇచ్చే పింఛన్‌ను ఇటీవలే కేసీఆర్ ప్రభుత్వం 4 వేల రూపాయలు చేసింది. ఇకపై ఈ పింఛన్‌ను 6 వేలకు పెంచుతామన్నారు. ఏడాదికి 250 రూపాయలు పెంచుతూ ఐదవ ఏట 6 వేలు అందిస్తామన్నారు. రాష్ట్రంలో 5 లక్షల 35 వేల దివ్యాంగులుకు ఈ విధంగా లబ్ది చేకూరుస్తామన్నారు.


Also read: brs manifesto 2023: BRS మేనిఫెస్టో విడుదల..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook