Telangana CM Kcr: తెలంగాణ సీఎం కేసీఆర్ వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తున్నారా..? పార్టీ ప్లీనరీ సమావేశం తర్వాత ఆయన మౌనం దేనికి సంకేతం..? టీఆర్ఎస్, ప్రభుత్వంపై ఢిల్లీ అగ్ర నేతలు  విమర్శలు గుప్పిస్తున్నా..ఎందుకు స్పందించడం లేదు..? విపక్షాలను తేలికగా తీసుకుంటున్నారా...?


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తెలంగాణ సీఎం కేసీఆర్ రూట్ మార్చినట్లు కనిపిస్తున్నారు. ఎప్పుడు సమీక్షా సమావేశాలు, పార్టీ మీటింగ్‌లతో బిజీగా ఉంటే ఆయన ఇటీవల వీటికి దూరంగా ఉన్నట్లు కనిపిస్తోంది. ప్రగతి భవన్‌ నుంచి ఎలాంటి కార్యక్రమాలు జరగడం లేదు. ఆయన ఎర్రవెల్లి ఫామ్‌ హౌస్‌కు మకాం మార్చినట్లు ప్రచారం జరుగుతోంది. వ్యూహాత్మకంగానే సీఎం కేసీఆర్ నడుచుకుంటున్నట్లు టీఆర్ఎస్ పార్టీ వర్గాలే అంటున్నాయి. తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీ పార్టీలు జోరు పెంచాయి. వరుసగా బహిరంగ సభలను పెడుతూ కార్యకర్తల్లో జోష్‌ నింపుతున్నాయి.    


ఇటీవల రాష్ట్రానికి వచ్చిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ..తెలంగాణ ప్రభుత్వం, సీఎం కేసీఆర్ టార్గెట్‌గా విమర్శలు గుప్పించారు. బంగారు తెలంగాణలో అవినీతి పాలన సాగుతోందని మండిపడ్డారు. ఆయన ఓయూకు వెళ్తారన్న ప్రచారమూ జరిగింది. హైదరాబాద్‌ వచ్చిన ఆయన టీపీసీసీ నేతలతో సమావేశమైయ్యారు. వారికి దిశానిర్దేశం చేశారు. రాహుల్ టూర్‌పై మంత్రులు, టీఆర్ఎస్ నేతలు ఘాటు విమర్శలు చేసినా..సీఎం కేసీఆర్ నుంచి ఎలాంటి కౌంటర్ రాలేదు. 


గత వారం తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్ర ముగింపు సందర్భంగా భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశారు. ఈ సభను కేంద్రమంత్రి, బీజేపీ సీనియర్ నేత అమిత్ షా పాల్గొన్నారు. తుక్కుగూడ వేదికగా టీఆర్ఎస్‌పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో రజకారుల పాలన సాగుతోందని..దానికి చరమగీతం పాడాలని పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను తమవిగా కేసీఆర్ చెప్పుకుంటున్నారని ఆరోపించారు. 


అమిత్ షా(AMITH SHAH) పర్యటనపై మంత్రులు, టీఆర్ఎస్‌ నేతలు కౌంటర్ ఇచ్చారు. అమిత్ షా కాదు..అబద్దాల షా అంటూ మండిపడ్డారు. ప్రభుత్వంపై బీజేపీ నేతలు అసత్య ప్రచారం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. అమిత్ షా రగడపై సీఎం కేసీఆర్ నుంచి స్పందన వస్తుందని ఆ పార్టీ నేతలు సైతం భావించారు. ఐతే ఆయన నుంచి ఎలాంటి కౌంటర్ రాలేదు. టూరిస్టుల గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదని టీఆర్ఎస్(TRS) నేతలు చెబుతున్నారు. ఇలాంటి వాటికి సీఎం కేసీఆర్ స్పందించాల్సిన అవసరం లేదంటున్నారు. ఇలాంటి పార్టీలను తెలంగాణ ప్రజలు నమ్మరని అంటున్నారు.


Also read:iPhone SE 3 Offers: రూ.29,900 ధరకే Apple iPhone SE 3 స్మార్ట్ ఫోన్ ను కొనేయండి!
Also read:Herbal Tea For High BP: అధిక రక్తపోటు నియంత్రణ కోసం ఈ 4 రకాల టీలను ట్రై చేయండి!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.