ముస్లిం రిజర్వేషన్లపై సీఎం కేసీఆర్ ఏమన్నారంటే..

ముస్లిం రిజర్వేషన్లపై కేసీఆర్ కీలక ప్రకటన
హైదరాబాద్: ముస్లిం రిజర్వేషన్లపై వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని ముఖ్యమంత్రి కేసీఆర్ పునరుద్ఘాటించారు. ఆదివారంనాటి అసెంబ్లీ సమావేశాల్లో సీఎం కేసీఆర్ సభను ఉద్దేశించి మాట్లాడుతూ ముస్లిం రిజర్వేషన్ల గురించి తన ప్రసంగంలో ప్రస్తావించారు. ముస్లిం రిజర్వేషన్లపై ప్రభుత్వం స్పష్టతతో ఉందని, మైనార్టీ రిజర్వేషన్లపై కేంద్ర ప్రభుత్వమే ఏదీ తేల్చకుండా నాన్చుతోందన్నారు. ముస్లింల రిజర్వేషన్లపై అవసరమైతే మరోసారి తీర్మానం చేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారు.
ఈ సందర్భంగా ఎన్‌ఆర్సీపై కేంద్రం నుంచి ఎలాంటి ఆదేశాలు రాలేదన్న కేసీఆర్.. ఎన్‌ఆర్సీ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని తేల్చిచెప్పారు.