సీఎం కేసీఆర్ చేతుల మీదుగా కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవం
దేశంలోనే కాకుండా ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుగా పేరు తెచ్చుకున్న కాళేశ్వరం ప్రాజెక్ట్ నేడు తెలంగాణ సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభోత్సవం జరుపుకోనుంది.
జయశంకర్ భూపాలపల్లి: దేశంలోనే కాకుండా ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుగా పేరు తెచ్చుకున్న కాళేశ్వరం ప్రాజెక్ట్ నేడు తెలంగాణ సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభోత్సవం జరుపుకోనుంది. కాళేశ్వరంలో ప్రాజెక్టులో కీలక భాగమైన మేడిగడ్డ బ్యారేజ్ కొన్ని పనులు మినహా కేవలం మూడేళ్ల కాలంలోనే మొత్తం నిర్మాణం పూర్తిచేసుకొని ప్రారంభానికి సిద్ధమైంది. శుక్రవారం ఉదయం 10.30 గంటల సమయంలో కేసీఆర్ ఈ ప్రాజెక్టును ప్రారంభించనుండగా.. గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ విశిష్ట అతిథిగా, ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవిస్, మహారాష్ట్ర గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్ రావు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారు.
[[{"fid":"178861","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]
తెలంగాణలోని లక్షల ఎకరాల బీళ్లను సస్యశ్యామలం చేసే లక్ష్యంతో నిర్మితమవుతోన్న కాళేశ్వరం ప్రాజెక్టుని ఓ ఇంజనీరింగ్ అబ్ధుతంగా పేర్కొనవచ్చు. గోదావరి నీటిని 100కుపైగా మీటర్ల ఎత్తులోకి తోడి అక్కడి జలశయాలను నింపి తిరిగి అదే నీటిని గోదావరిలోకి వదిలే మహాయజ్ఞమే కాళేశ్వరం ప్రాజెక్ట్. అన్నింటికిమించి నది ప్రవాహానికి వ్యతిరేక దిశలో నీటిని తరలించడం కాళేశ్వరం ప్రాజెక్టును మరో అద్భుతంగా నిలబెట్టింది. రాబోయే తరాలకు చారిత్రక ఘట్టంగా నిలిచిపోనున్న కార్యక్రమానికి జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలంలోని మేడిగడ్డ బ్యారేజ్, కన్నెపల్లి పంప్ హౌజ్ వేదిక కానున్నాయి.