CM Kcr: తెలంగాణ భవన్‌లో ఈనెల 5న జరగబోయే టీఆర్ఎస్ జనరల్ బాడీ మీటింగ్ యధావిధిగా కొనసాగుతుందని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. మునుగోడు ఉప ఎన్నిక షెడ్యూల్ ప్రభావం పార్టీ సమావేశంపై ఉండదన్నారు. దీనిపై పార్టీ సభ్యులు అనుమానాలకు గురి కావద్దని అన్నారు. ముందుగా ప్రకటించినట్లు అక్టోబర్ 5న ఉదయం 11 గంటలకు పార్టీ సర్వసభ్య సమావేశం జరుగుతుందని తేల్చి చెప్పారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అందరూ నిర్దేశిత సమయంలోపే హాజరుకావాలన్నారు. మరోవైపు దసరా రోజు ఏం జరగబోతోందన్న దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. అదేరోజు జాతీయ పార్టీని సీఎం కేసీఆర్ ప్రకటించబోతున్నారు. అది కొత్త పార్టీనా..లేక ఉన్న పార్టీనే పేరు మార్చబోతున్నారా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. టీఆర్ఎస్‌ పార్టీనే బీఆర్ఎస్ మార్చబోతున్నారని విశ్వసనీయంగా సమాచారం అందుతోంది. ఇప్పుడున్న గుర్తు, జెండానే జాతీయ స్థాయిలో తీసుకెళ్లాలని సీఎం కేసీఆర్ యోచిస్తున్నారు.


దసరా రోజు జరిగే పార్టీ సమావేశంలో ఇదే విషయాన్ని వెల్లడిస్తారని తెలుస్తోంది. పార్టీ మార్పుపై మంత్రులు, ప్రజాప్రతినిధులు, నేతల నుంచి అభిప్రాయాలు తీసుకోనున్నారు. సభలోనే నేతలకు దిశానిర్దేశం చేస్తారు. అనంతరం పార్టీ పేరు ప్రకటన ఉంటుందని తెలంగాణ భవన్‌ వర్గాలు చెబుతున్నాయి. మునుగోడు ఉప ఎన్నికలో బీఆర్ఎస్ పార్టీ పోటీ చేయబోతోందని తెలుస్తోంది. ఆ దిశగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. 


ఇప్పటికే ప్రగతిభవన్‌లో మంత్రులు, అందుబాటులో ఉన్న నేతలతో ఆయన మంతనాలు జరిపారు. జాతీయ పార్టీ ఏర్పాటుపై విస్తృతంగా చర్చలు జరిపారు. ఉన్న పార్టీనే జాతీయ స్థాయిలోకి తీసుకెళ్తే తలెత్తే న్యాయపరమైన చిక్కులు, అనంతర పరిణామాలపై సుదీర్ఘంగా చర్చించారు. దసరా రోజు జరగబోయే పార్టీ సమావేశంలో కీలక తీర్మానాలు చేస్తారని తెలుస్తోంది. అందులోనే టీఆర్ఎస్‌ను బీఆర్ఎస్‌గా మారుస్తారని సమాచారం అందుతోంది. 


పార్టీ తీర్మానాలను కేంద్ర ఎన్నికల సంఘానికి పంపుతారని తెలుస్తోంది. ఈనెల 5న పార్టీ ప్రకటన తర్వాత వివిధ రాష్ట్రాలకు చెందిన రైతులతో సమావేశం కానున్నట్లు టీఆర్ఎస్ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఇప్పటికే వివిధ రాష్ట్రాల్లో పర్యటించిన సీఎం కేసీఆర్..జాతీయ రాజకీయాలపై చర్చించారు. డిసెంబర్ 9న ఢిల్లీలో భారీ బహిరంగసభను నిర్వహించబోతున్నారు. 


Also read:Weather Alert: తెలుగు రాష్ట్రాలకు అల్పపీడనం ముప్పు..వాతావరణ శాఖ హెచ్చరికలు ఇవే..!


Also read:Fishermen: తమిళనాడు మత్స్యకారుల వలకు చిక్కిన అంబర్ గ్రిస్..ధర తెలుస్తే షాకే..!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link - https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook