Telangana CM KCR: సీఎం కేసీఆర్‌కు అస్వస్థత.. యశోద హాస్పిటల్‌లో వైద్య పరీక్షలు!!
Telangana CM KCR Visits Yashoda Hospital. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. వైద్య పరీక్షల కోసం సోమాజిగూడలోని యశోద హాస్పిటల్‌కు సీఎం వెళ్లారు.
Telangana CM KCR Visits Somajiguda Yashoda Hospital: తెలంగాణ సీఎం కేసీఆర్ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. వైద్య పరీక్షల కోసం సోమాజిగూడలోని యశోద హాస్పిటల్‌కు సీఎం కొద్దిసేపటి క్రితం వెళ్లారు. స్వల్ప అస్వస్థత ఉండడంతో కుటుంబ సభ్యులు శుక్రవారం ఉదయం హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. భారీ సెక్యూరిటీ మధ్యలో సీఎం ఆసుపత్రి లోపలికి నడుచుకుంటూ వెళ్లారు. సీఎంతో పాటుగా ఆయన సతీమణి శోభ కూడా ఉన్నారు. నిన్నటి నుంచి ఎడమ చేతు కాస్త లాగడంతోనే ఆసుపత్రికి వెళ్లినట్టు సమాచారం తెలుస్తోంది.
ప్రస్తుతం సీఎం కేసీఆర్‌కు యశోద హాస్పిటల్‌లో వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారట. సిటీ స్కాన్, యాంజియోగ్రామ్ పరీక్షలు చేస్తున్నారట. ఈ విషయాన్ని తెలంగాణ సీఎంవో ఓ ప్రకటనలో వెల్లడించింది. మధ్యాహ్నం వరకు సీఎం యశోద హాస్పిటల్‌లోనే ఉంటారని సమాచారం తెలుస్తోంది. మరికొన్ని గంటల్లో ఆ రిపోర్టులు రానున్నాయి. ఇప్పటివరకు అయితే సీఎం ఆరోగ్యం బాగానే ఉందని చెప్పారు.
సీఎం కేసీఆర్‌కు జనరల్ చెక్ అప్ నిర్వహించినట్లు యశోద హాస్పిటల్ డాక్టర్ ఎంపీ రావు తెలిపారు. జనరల్ చెక్ అప్‌లోని అన్ని పరీక్షలతో పాటు సిటీ స్కాన్, ఎంజియోగ్రామ్ నిర్వహించినట్లు వెల్లడించారు. మరికొన్ని గంటల్లో రిపోర్టులు వస్తాయని చెప్పారు. ఇప్పటి వరకు అయితే బీపీ, షుగర్ లెవల్స్ నార్మల్‌గా ఉన్నాయని ఆయన వెల్లడించారు. ప్రస్తుతం సీఎం ఆరోగ్యం నిలకడగానే ఉందని.. ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు.
[[{"fid":"224321","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]
గత రెండు రోజులుగా తెలంగాణ సీఎం కేసీఆర్ వీక్‌గా ఉన్నారని, దీనికి తోడు ఎడమ చేయి లాగుతున్నట్లు అనిపించడంతో ముందు జాగ్రత్త చర్యగా చెక్ అప్‌కు వచ్చినట్లు సోమాజిగూడలోని యశోద హాస్పిటల్ వైద్యులు వివరించారు. సీఎం ఆరోగ్యంకు సంబంధించి హెల్త్ బులిటిన్ త్వరలోనే విడుదల చేసే అవకాశం వుంది. ఇక ఆరోగ్యం క్షీణించడంతో ఈరోజు యాదాద్రి పర్యటనను కేసీఆర్ రద్దు చేసుకున్నారు.
[[{"fid":"224322","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"2":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"2"}}]]
Also Read: IND vs SL 2nd Test: క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్.. డేనైట్ టెస్టులో ప్రేక్షకులకు అనుమతి! ఈసారి ఫుల్ క్రౌడ్!!
Also Read: AAP national party status: జాతీయ పార్టీ హోదాతో.. కాంగ్రెస్ స్థానాన్ని భర్తీ చేయనున్న ఆప్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook