revanth reddy and brs ktr will share stage at sitaram Yechury memorial: తెలంగాణలో ప్రస్తుతం రాజకీయాలు రసవత్తరంగా నడుస్తున్నాయి. బీఆర్ఎస్ లు, కాంగ్రెస్ ల మధ్య పచ్చ గడ్డివేస్తే భగ్గుమంటుందన్న విధంగా పొలిటికల్ హీట్ నడుస్తోంది. ఒక వైపు ఇటీవల ఇద్దరు ఎమ్మెల్యేల మధ్య రచ్చ.. బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ లా మారిపోయింది. శేరిలింగం పల్లి ఎమ్మెల్యే అరికేపూడి గాంధీ, పాడి కౌశిక్ రెడ్డిల సవాళ్లు, ప్రతిసవాళ్లతో పొలిటికల్ హీట్ ఎక్కసారిగా పీక్స్ కు చేరింది. బీఆర్ఎస్ కు చెందిన నేతలు.. కాంగ్రెస్ ను గట్టిగానే విమర్శలు చేశారు.అదే విధంగా కాంగ్రెస్ కూడా ఎక్కడికక్కడ బీఆర్ఎస్ శ్రేణుల్ని కట్టడి చేసిందని చెప్పుకొవచ్చు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సీఎం రేవంత్ కూడా.. కేటీఆర్ వ్యాఖ్యలకు స్ట్రాంగ్ గానే కౌంటర్ సైతం ఇచ్చారు. బీఆర్ఎస్ గుర్తుమీద గెల్చుకున్న ఎమ్మెల్యేలను సీఎం రేవంత్.. పార్టీలో చేర్చుకొవడంఏంటని బీఆర్ఎస్ విమర్శలు గుప్పిస్తుంది. మరోవైపు కాంగ్రెస్ కూడా అంతే గట్టిగా.. గతంలో ఒక్కసారి మీరు చేసిన పనుల్ని గుర్తుచేసుకొవలని గట్టిగానే రిప్లై ఇచ్చింది. కాంగ్రెస్ ఇచ్చిన హమీలను నెరవేర్చకుంటూ.. డైవర్షన్ పాలిటిక్స్ కు పాల్పడుతుందని కూడా.. పలుమార్లు కేటీఆర్ ఎద్దేవా చేశారు. ఇదిలా ఉండగా. .తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. 


పూర్తి వివరాలు..


తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి, కేటీఆర్ ల మధ్య ప్రస్తుతం తగ్గా.. ఫార్ మాటల యుద్దం నడుస్తోంది.  ఈ నేపథ్యంలో వీరిద్దరు ఒకేవేదిక మీద కన్పించబోతున్నారు. ఇది రాజకీయంగా హాట్ టాపిక్ గా మారింది.  ఇటీవల సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ఇటీవల సెప్టెంబర్ 12న.. అనారోగ్యంతో కన్నుమూసిన విషయం తెలిసిందే. ఈ నెల 21న సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సీపీఎం పార్టీ ఏచూరి సంస్మరణ సభ నిర్వహించనుంది.


ఈ సభకు గెస్టులుగా రావాలంటూ.. ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని, అటు కేటీఆర్ ను సీపీఎం నాయకులు ఆహ్వానించినట్లు తెలుస్తోంది.  హైదరబాద్ కు చెందిన వ్యక్తి.. రాజకీయాలకు అతీతంగా సీతారం ఏచూరీ అందరితో కూడా సత్సంబంధాలను కొనసాగించారు. అలాంటి ఉన్నతమైన వ్యక్తికి  గౌరవంగా నిర్వహిస్తున్న సంస్కరణ సభకు పలువురు రాజకీయ నాయకులు కూడా వస్తున్నట్లు తెలుస్తోంది.


Read more: Revanth Reddy: సంబరాల్లో కాంగ్రెస్ శ్రేణులు.. గణేష్ ఉత్సవాల వేళ సీఎం రేవంత్ రెడ్డి అరుదైన రికార్డులు.. డిటెయిల్స్..  


దీనిలో భాగంగానే.. ఇద్దరు రాజకీయ ప్రత్యర్థులు ఒకే వేదికమీదకు వచ్చిన ఎలా ఉంటారో అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. గతంలో మాజీ సీఎం కేసీఆర్ ఆస్పత్రిలో ఉన్నప్పుడు సీఎం రేవంత్ పరామర్శించారు. అప్పుడు.. కేటీఆర్, రేవంత్ ను దగ్గరుండి మరీ కేసీఆర్ దగ్గరకు తీసుకెళ్లారు . కానీ ఇప్పుడు మాత్రం పొలిటికల్ గా హీట్ వాతావరణం ఉంది. ఈ సమయంలో వీరిద్దరి భేటీపై ప్రాధాన్యత సంతరించుకుందని చెప్పుకొవచ్చు.


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.