TELANGANA CONG LIST:తెలంగాణ కాంగ్రెస్ అభ్యర్థులు వీళ్లే.. ? పీసీసీ నుంచి ఏఐసీసీకి వెళ్లిన జాబితా లీక్..?
Revanth reddy Team: ముందస్తు ఎన్నికలు ఖాయమని విపక్షాలు భావిస్తున్నాయి. అభ్యర్థుల ఎంపికపై ఫోకస్ చేశాయి. తెలంగాణ పీసీసీ ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా సర్వే చేయిందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే పీసీసీ.. పార్టీ హైకమాండ్ కు అభ్యర్థుల జాబితా పంపిందనే ప్రచారం సాగుతోంది. తాజాగా పీసీసీ పంపిన జాబితా ఇదేనంటూ ఓ లిస్ట్ బయటికి వచ్చింది.
Revanth reddy Team: తెలంగాణ రాజకీయాలు హాట్ హాట్ గా సాగుతున్నాయి. అన్ని పార్టీలు జనంలోనే ఉంటున్నాయి. మంత్రులు కేటీఆర్, హరీష్ రావు జోరుగా జిల్లాలు చుట్టేస్తున్నారు. కాంగ్రెస్ రచ్చబండ పేరుతో ప్రజల్లోకి వెళుతోంది. నేతలంతా గ్రామాల్లోనే తిరగాలని పీసీసీ ఆదేశాలు జారీ చేసింది. బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఇప్పటికే రెండు విడతలుగా పాదయాత్ర చేశారు. త్వరలో మూడో విడత యాత్ర మొదలుకానుంది. బీజేపీ జాతీయ నేతలు తెలంగాణకు క్యూ కడుతున్నారు. మే నెలలోనే ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, జేపీ నడ్డాలు తెలంగాణలో పర్యటించారు. జూలై 2, 3 తేదీల్లో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు కూడా హెదరాబాద్ లోనే జరగనున్నా.యి. ముందస్తు ఎన్నికలు వస్తాయని భావిస్తున్నందువల్లే పార్టీలు దూకుడు పెంచాయని అంటున్నారు.
సీఎం కేసీఆర్ కోసం ప్రశాంత్ కిషోర్ టీమ్ లు సర్వేలు చేస్తుండటంతో ముందస్తు ఎన్నికలు ఖాయమని విపక్షాలు భావిస్తున్నాయి. అందుకే అభ్యర్థుల ఎంపికపై ఫోకస్ చేశాయి. సర్వేలు జరిపిస్తూ బలమైన నేతను గుర్తిస్తున్నాయి. తెలంగాణ పీసీసీ కూడా ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా సర్వే చేయిందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే పీసీసీ.. పార్టీ హైకమాండ్ కు అభ్యర్థుల జాబితా పంపిందనే ప్రచారం సాగుతోంది. తాజాగా పీసీసీ పంపిన జాబితా ఇదేనంటూ ఓ లిస్ట్ బయటికి వచ్చింది. గాంధీభవన్ నుంచి ఈ జాబితా లీకైందని అంటున్నారు. పీసీసీ నుంచి ఏఐసీసీకి వెళ్లినట్లుగా చెబుతున్న ఈ జాబితా ఇప్పుడు కాంగ్రెస్ లో సెగలు రేపుతోంది. ఇందులో పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి వర్గానికి చెందిన వారి పేర్లు ఎక్కువగా ఉండటంతో సినీయర్లు భగ్గుమంటున్నారు.
గాంధీభవన్ నుంచి లీకైనట్లుగా చెబుతున్న కాంగ్రెస్ అభ్యర్థుల లిస్ట్ ఇదే...
వరంగల్ తూర్పు- వేం నరేందర్ రెడ్డి
పరకాల- కొండా సురేఖ
నర్సంపేట- దొంతి మాధవరెడ్డి
జనగామ- పొన్నాల లక్ష్మయ్య
పాలకుర్తి - జంగా రాఘవరెడ్డి
వరంగల్ వెస్ట్ - నాయిని రాజేందర్ రెడ్డి
ములుగు- సీతక్క
భూపాలపల్లి- గండ్ర సత్యనారాయణ
నల్గొండ - కోమటిరెడ్డి వెంకటరెడ్డి
హుజుర్నగర్- ఉత్తమ్ కుమార్ రెడ్డి
కొడంగల్ - రేవంత్ రెడ్డి
కోదాడ - ఉత్తమ్ పద్మావతి
సూర్యాపేట- దామోదర్‌రెడ్డి లేదా పటేల్ రమేష్ రెడ్డి
ఆలేరు - బీర్ల ఐలయ్య
నాగార్జున సాగర్- రఘువీర్ రెడ్డి
నకిరేకల్ - ప్రీతం
మిర్యాలగూడ- జానారెడ్డి
భువనగిరి- కుంభం అనిల్ కుమార్ రెడ్డ
తుంగతుర్తి- అద్దంకి దయాకర్
దేవరకొండ- కిషన్ నాయక్
జడ్చర్ల- మల్లు రవి లేదా అనురుధ్ రెడ్డి
నాగర్ కర్నూల్- నాగం జనార్థన్ రెడ్డి
కొల్లాపూర్- అభిలాష్ రావు
మహబూబ్‌నగర్ - ఓబెదుల్లా
దేవరకద్ర - ప్రదీప్ కుమార్ గౌడ్
షాద్ నగర్ - వీర్లపల్లి శంకర్
గద్వాల- రాజీవ్ రెడ్డ
సంగారెడ్డి - జగ్గారెడ్డి
ఆంధోల్- దామోదర రాజనర్సింహా
నారాయణఖేడ్ - సురేష్ షట్కర్
నిర్మల్ - మహేశ్వర్ రెడ్డి
చెన్నూరు- నల్లాల ఓదెలు
నిజామాబాద్ - మహేశ్ కుమార్ గౌడ్
కామారెడ్డి - షబ్బీర్ అలీ
ఎల్బీనగర్ - మల్ రెడ్డి రాంరెడ్డి
కూకట్పల్లి - శ్రీరంగం సత్యం
కుత్బుల్లాపూర్ - భూపతిరెడ్డి
ఖైరతాబాద్ - దాసోజు శ్రవణ్ లేదా రోహన్ రెడ్డి
సత్తుపల్లి - మానవతారాయ్
కరీంనగర్- పొన్నం ప్రభాకర్
వేములవాడ- ఆది శ్రీనివాస్
మంథని- శ్రీధర్ బాబు
పెద్దపల్లి- విజయరమణారావు
హుస్నాబాద్- బొమ్మ శ్రీరాం చక్రవర్తి
సిరిసిల్ల- కేకే మహేందర్ రెడ్డి
చొప్పదండి- మేడిపల్లి సత్యం
హుజురాబాద్ - బల్మూరి వెంకట్
మానకొండూరు - కవ్వంపల్లి సత్యనారాయణ
రామగుండం - రాజ్ ఠాగూర్ మక్కాన్ సింగ్
READ ALSO: KCR NEW PARTY:మమత భేటీకి కేసీఆర్ డుమ్మా అందుకేనా! రాష్ట్రపతి ఎన్నికల బరిలో ఉండేదెవరు?
READ ALSO: TS Inter Results 2022: రేపే ఇంటర్ ఫలితాలు.. క్లారిటీ ఇచ్చిన టిఎస్ ఇంటర్ బోర్డు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook