Telangana Congress: తెలంగాణ కాంగ్రెస్ లోక్‌సభ అభ్యర్ధులు ఖరారైనట్టేనా, జాబితాలో ఎవరెవరు
Telangana Congress: లోక్‌సభ ఎన్నికలకు తెలంగాణ కాంగ్రెస్ సిద్ధమౌతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన ఆ పార్టీ లోక్‌సభలో సత్తా చాటాలని ప్రయత్నిస్తోంది. ఓ వైపు టికెట్ల ఖరారు, మరోవైపు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి వలసలతో ఆశావహుల సంఖ్య పెరుగుతోంది.
Telangana Congress: తెలంగాణలో లోక్‌సభ ఎన్నికలు ఏపీతో పాటు మే 13న జరగనున్నాయి. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అనూహ్యంగా బీఆర్ఎస్‌ను మట్టికరిపించి అధికారంలో వచ్చిన కాంగ్రెస్ పార్టీ లోక్‌సభ ఎన్నికల్లో అదే ఊపు కొనసాగించేందుకు వ్యూహాలు రచిస్తోంది. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వలసల నేపధ్యంలో టికెట్ ఆశావహుల సంఖ్య పెరుగుతోంది. అన్నింటినీ పరిగణలో తీసుకుని తుది జాబితా దాదాపు సిద్ధం చేసినట్టు తెలుస్తోంది.
తెలంగాణలోని 17 లోక్‌సభ స్థానాలకు పోటీ చేసే అభ్యర్ధుల్లో నలుగురి పేర్లను కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే ఖరారు చేసింది. ఆ నలుగురిలో మహబూబ్ నగర్ నుంచి వంశీచంద్ రెడ్డి, మహబూబాబాద్ నుంచి బలరాం నాయక్, జహీరాబాద్ నుంచి సురేశ్ షెట్కార్, నల్గొండ నుంచి కుందూరు రఘువీర్ రెడ్డి ఉన్నారు. ఇక రెండో జాబితా కూడా దాదాపుగా సిద్ధమైనట్టు సమాచారం. ఇందులో భాగంగా మల్కాజ్‌గిరి నుంచి సునీతా మహేందర్ రెడ్డి పేరు దాదాపుగా ఖరారైంది. చేవెళ్ల నుంచి ఇటీవల పార్టీలో చేరిన రంజిత్ రెడ్డి, సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్ధిగా దానం నాగేందర్ పేర్లు ఖరారయ్యాయి.
ఇక నాగర్ కర్నూలు నుంచి మల్లు రవి, పెద్దపల్లి నుంచి గడ్డం వంశీ, మెదక్ నుంచి నీలం మధు, నిజామాబాద్ నుంచి జీవన్ రెడ్డి పేర్లు ఖరారయ్యాయి. అంటే అంటే రెండో జాబితాలో 7 పేర్లను కాంగ్రెస్ పార్టీ దాదాపుగా ఖరారు చేసింది. ఇంకా అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. ఇవి కాకుండా వరంగల్ నుంచి పసునూరి దయాకర్, కరీంనగర్ నుంచి ప్రణీత్ రెడ్డి, అదిలాబాద్ నుంచి డాక్టర్ సుమలత పేర్లు విన్పిస్తున్నాయి.
హైదరాబాద్, ఖమ్మం, భువనగిరి స్థానాల అభ్యర్ధుల్ని ఇంకా ఖరారు చేయాల్సి ఉంది. భువనగిరి నుంచి తెలంగాణ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు చామల కిరణ్ రెడ్డి లేదా ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి భార్య కోమటిరెట్టి లక్ష్మి పేర్లు విన్పిస్తున్నాయి.
Also read: AP Summer Holidays: విద్యార్ధులకు శుభవార్త, ఈసారి ముందస్తు సెలవులు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook