Jagga Reddy: ఏపీలో ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పు అంశం చల్లాడం లేదు. దీనిపై అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఈనేపథ్యంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పు సరికాదన్నారు. హెల్త్ యూనివర్సిటీకి వైఎస్ఆర్ పేరు పెడుతూ సీఎం జగన్ తీసుకున్న నిర్ణయాన్ని ఖండించారు. అధికారంలో ఉన్నప్పుడు చేసే పనులు ఆమోదయోగ్యంగా ఉండాలన్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడిన ఆయన..సీఎం జగన్, వైస్‌ఆర్‌టీపీ అధినేత్రి షర్మిల తీరుపై ఆసక్తిర వ్యాఖ్యలు చేశారు. వైఎస్ షర్మిల..ఎందు కోసం పాదయాత్ర చేస్తున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు జగ్గారెడ్డి. నాయకులను తిట్టేందుకు చేస్తున్నారా..నేతలపై వ్యక్తిగతంగా బురద చల్లితే ఎలా అని ప్రశ్నించారు. తమ దగ్గర ఇలాంటి చాలా ఉన్నాయన్నారు. వైఎస్‌ఆర్ కుమార్తె అయినంత మాత్రన విమర్శిస్తే ఊరుకుంటామా అని అన్నారు. 


తండ్రి బాటలో షర్మిల నడవడం లేదని విమర్శించారు జగ్గారెడ్డి. ఇప్పటివరకు ఆమె బీజేపీని విమర్శించినట్లు కనిపించ లేదు. ప్రధాని మోదీని వైఎస్ షర్మిల ఎందుకు ప్రశ్నించడం లేదన్నారు. జగన్, షర్మిల ఇద్దరూ బీజేపీ వదిలిన బాణాలేనని మండిపడ్డారు. బీజేపీ డైరెక్షన్‌లోనే అంతా జరుగుతోందన్నారు. మోదీ, అమిత్ షా చెప్పినట్లు వాళ్లంతా నడుచుకుంటున్నారని తెలిపారు. హైదరాబాద్‌లో ఉన్న ఏపీ ప్రాంత ప్రజల ఓటు బ్యాంకు చీల్చి బీజేపీకి ఉపయోగపడాలనేది వారిద్దరి వ్యూహామని ఆరోపించారు.


అడ్డగోలుగా సంపాదించి సొమ్ము బయటకు రాకకుండా ఉండేందుకు బీజేపీతో మంచిగా మెలుగుతున్నారని విమర్శించారు జగ్గారెడ్డి. ఏపీకి రాజధానిగా అమరావతే ఉండాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించిందని స్పష్టం చేశారు. మూడు ప్రాంతాల్లో మూడు రాజధానులు సరికాదన్నారు. దీని వల్ల అభివృద్ధి సాధ్యం కాదన్నారు. ఈ విషయంలో సీఎం జగన్‌ సరిగా నడుచుకోవడం లేదని విమర్శించారు. అమరావతిపై చంద్రబాబు నిర్ణయం సరైనదేనని అనిపిస్తోందన్నారు జగ్గారెడ్డి.


మరోవైపు ఏపీలో ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పుపై వివాదం కొనసాగుతోంది. దీనిపై రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ నేతలు ఆందోళనలు నిర్వహిస్తున్నారు. పేరును మార్చే వరకు ప్రజా పోరాటం చేస్తామని స్పష్టం చేస్తున్నారు. అధికారంలోకి రాగానే పేరును మార్చి వేస్తామంటున్నారు.


Also read:SSC Jobs: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌..ఎస్‌ఎస్‌సీ నుంచి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్..! 


Also read:IND vs AUS: సూపర్ ఫామ్‌లో విరాట్ కోహ్లీ..తన ఖాతాలోకి సరికొత్త రికార్డు..!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook