Jagga Reddy: సీఎల్పీ భేటీని బాయ్‌కాట్ చేసిన జగ్గారెడ్డి.. రేవంత్‌పై మరోసారి ఫైర్..
Jagga reddy Boycotts CLP Meeting: కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సీఎల్పీ భేటీని బాయ్‌కాట్ చేశారు. తన గోడు వినేందుకు అవకాశం లేని చోట ఉండటమెందుకని అర్ధాంతరంగా బయటకొచ్చినట్లు తెలిపారు.
Jagga reddy Boycotts CLP Meeting: తెలంగాణ కాంగ్రెస్‌లో జగ్గారెడ్డి తన ధిక్కార స్వరం వినిపిస్తూనే ఉన్నారు. పార్టీ రాష్ట్ర నాయకత్వంపై కొంతకాలంగా తీవ్ర అసంతృప్తితో ఉన్న జగ్గారెడ్డి తాజాగా సీఎల్పీ భేటీ నుంచి అర్ధాంతరంగా బయటకొచ్చారు. పార్టీలో తనకు ఎదురైన చేదు అనుభవాలను ప్రస్తావించేందుకు భేటీలో అవకాశం ఇవ్వకపోవడంతో జగ్గారెడ్డి నొచ్చుకున్నారు. దీంతో సమావేశం మధ్యలోనే ఆయన బయటకొచ్చారు.
సోమవారం (మార్చి 7) నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానుండటంతో.. సభలో లేవనెత్తాల్సిన అంశాలపై చర్చించేందుకు ఇవాళ సీఎల్పీ భేటీ అయింది. హైదరాబాద్‌లోని తాజ్ డెక్కన్ హోటల్‌లో ఈ భేటీ జరిగింది. సీఎల్పీ భేటీకి కొద్ది గంటల ముందు జగ్గారెడ్డి మీడియా సమావేశానికి సిద్ధపడగా కాంగ్రెస్ పెద్దలు వారించడంతో ప్రెస్ మీట్‌ను విరమించుకున్నారు. ఆ తర్వాత నేరుగా తాజ్ డెక్కన్ హోటల్‌కు వెళ్లిన ఆయన.. అక్కడ అరగంట పాటు ఉన్నట్లు తెలుస్తోంది.
సీఎల్పీ భేటీలో అసెంబ్లీలో లేవనెత్తాల్సిన ప్రజా సమస్యలు మాత్రమే ప్రస్తావించాలని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, మరికొందరు నేతలు సూచించడంతో జగ్గారెడ్డి నొచ్చుకున్నట్లు తెలుస్తోంది. పార్టీలో తనకు ఎదురైన చేదు అనుభవాలను ప్రస్తావించేందుకు అవకాశం ఇవ్వకపోవడంతో జగ్గారెడ్డి అర్ధాంతరంగా సమావేశం నుంచి బయటకొచ్చారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన.. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై మరోసారి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
రేవంత్ రెడ్డి ప్రోటోకాల్ పాటించడం లేదని జగ్గారెడ్డి ఆయనపై ఫైర్ అయ్యారు. మెదక్ జిల్లాలో పర్యటిస్తున్న రేవంత్ రెడ్డి.. స్థానిక ఎమ్మెల్యే అయిన తనకు సమాచారం ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తనకెదురైన చేదు అనుభవాన్ని చెప్పుకునే అవకాశం ఇవ్వనప్పుడు సీఎల్పీ భేటీలో ఉండటమెందుకని బయటకొచ్చేసినట్లు తెలిపారు. అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతానని.. ఎమ్మెల్యేగా అది తన హక్కు అని పేర్కొన్నారు.
Also Read: Russia Ukraine War: నన్ను ప్రాణాలతో చూడటం ఇదే చివరిసారి కావొచ్చు.. జెలెన్‌స్కీ సంచలన వ్యాఖ్యలు..
Roja on Mahesh Babu: మహేష్ బాబుకు హ్యాట్సాఫ్ చెప్పిన ఎమ్మెల్యే రోజా..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook