Mallu Bhatti Vikramarka: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఇంట్లో తీవ్ర విషాదం..
Hyderabad: కాంగ్రెస్ డిప్యూటి మినిస్టర్ ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. ఆయన సోదరుడు వెంకటేశ్వర్లు కన్నుమూసినట్లు తెలుస్తోంది. దీంతో ఆయన వెంటనే ఖమ్మం కు బయల్దేరినట్లు సమాచారం.
Mallu Bhatti Vikramarka brother Passed Away: తెలంగాణ కాంగ్రెస్ డిప్యూటీ సీఎం మల్లు భట్టీ విక్రమార్క ఇంట్లో తీవ్ర విషాదకర ఘటన సంభవించింది. ఆయన సోదరుడు వెంకటేశ్వర్లు కన్నుమూసినట్లు ఆయనకు సమాచారం అందింది. దీంతో ఆయన హుటాహుటీన ఖమ్మంకు బయల్దేరినట్లు ఆయన సన్నిహితులు తెలిపారు. అదే విధంగా వైరా మండలం స్నానాల లక్ష్మీపురంలో నేడు అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
Read More: Keerthy Suresh: కీర్తి సురేష్ కి ప్రేమలేఖ.. ఆ అబ్బాయి గురించి బయట పెట్టిన హీరోయిన్
దీంతో పలువురు కాంగ్రెస్ నేతలు ఆయనకు ఫోన్ లు చేసి , తమ సంతాపం తెలిపారు. గత కొంత కాలంగా వెంకటెశ్వర్లు హైదరాబాద్ల లోని ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. మల్లు వెంకటేశ్వర్లు.. ఆయుష్ శాఖలో ప్రొఫెసర్ గా, అడిషనల్ డైరెక్టర్ గా చేసిన రిటైర్ అయ్యారు.
మరోవైపు కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఈరోజు మేడిగడ్డ ప్రాజెక్టును సందర్శించడానికి సిద్దమౌతున్నారు. ఈ క్రమంలోనే భట్టీ ఇంట విషాదం చోటు చేసుకొవడంతో తన ప్రయాణాన్ని క్యాన్షిల్ చేసుకుని ఖమ్మంకు బయల్దేరినట్లు తెలుస్తోంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link: https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link: https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook