CoronaVirus Cases: తెలంగాణలో మళ్లీ పెరుగుతున్న కరోనా పాజిటివ్ కేసులు
CoronaVirus Cases In Telangana: తెలంగాణలో కరోనా వైరస్ వివరాలను రోజువారీగా విడుల చేస్తుంది. శనివారం రాత్రి 8 గంటల వరకు 176 పాజిటివ్ కేసులు నమోదుకాగా, ఒకరు మృతిచెందారు.
Telangana CoronaVirus Cases: తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర హైకోర్టు ఆదేశాలు పాటిస్తోంది. రాష్ట్రంలో కరోనా వైరస్ వివరాలను రోజువారీగా విడుల చేస్తుంది. శనివారం రాత్రి 8 గంటల వరకు 176 పాజిటివ్ కేసులు నమోదుకాగా, ఒకరు మృతిచెందారు. దీంతో తెలంగాణలో మొత్తం కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 2,98,807కి చేరింది.
నిన్న ఒక్కరోజు 40,985 కరోనా నిర్ధరణ పరీక్షలు నిర్వహించారు. అందులో 176 శాంపిల్స్‌కు కోవిడ్-19 (COVID-19) పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఒకరు కరోనాతో కన్నుమూశారు. తెలంగాణలో కరోనా మరణాల సంఖ్య 1,634కు చేరింది. అదే సమయంలో శనివారం ఒక్కరోజు 163 మంది కోలుకున్నారు. ఇప్పటివరకూ 2,95,222 మంది చికిత్స అనంతరం కరోనా బారి నుంచి కోలుకుని డిశ్ఛార్జ్ అయ్యారు.
జీహెచ్ఎంసీ పరిధిలో తాజాగా 27 కేసులు నమోదయ్యాయి. తెలంగాణ(Telangana)లో ప్రస్తుతం 1,951 యాక్టివ్ కేసులున్నాయి. 859 మంది వైద్యుల సలహా మేరకు హోం ఐసోలేషన్‌లో చికిత్స తీసుకుంటున్నారు. తెలంగాణ ప్రభుత్వం త్వరలోనే సీరం సర్వే నిర్వహించనుంది. తెలంగాణలో కరోనా నుంచి కోలుకున్న వారి శాతం 98.80కు చేరింది.
Also Read: Corona Vaccine: కరోనా విజేతలపై ఆసక్తికర విషయం, COVID-19 Vaccine ఒక్క డోసు ఇస్తే చాలు
కాగా, దేశ వ్యాప్తంగా కరోనా మరణాల రేటు 1.4 శాతం ఉండగా, తెలంగాణలో మాత్రం 0.54 శాతం మాత్రమే ఉండటం గమనార్హం. తెలంగాణలో ఇప్పటివరకూ మొత్తం 87,00,651 శాంపిల్స్‌కు కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారని ఆదివారం విడుదల చేసిన కరోనా బులెటిన్‌లో పేర్కొన్నారు.
Also Read: Effect Of COVID-19 Vaccine: కరోనా టీకాల ప్రభావం.. అధ్యయనాలు ఏం చెబుతున్నాయంటే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook