Telangana active cases at 26,633 : తెలంగాణలో కొవిడ్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. రాష్ట్రంలో రోజురోజుకు కేసుల సంఖ్య పెరుగుతోంది. తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 1,20,215 కొవిడ్ నిర్ధారణ పరీక్షలు (Covid tests) నిర్వహించారు. అయితే కొత్తగా 4,207 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో తెలంగాణలో మొత్తం ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 7,22,403కి చేరింది. ఇందులో ఇప్పటి వరకు 6,91,703 మంది కొవిడ్ (Covid) నుంచి కోలుకున్నారు. ఈ మేరకు తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ బులిటెన్‌ విడుదల చేసింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇక గత 24 గంటల వ్యవధిలో తెలంగాణలో కొవిడ్ వల్ల ఇద్దరు మృతి చెందారు. దీంతో ఇప్పటి వరకు తెలంగాణలో ప్రాణాలు కోల్పోయినవారి సంఖ్య 4,067కి చేరింది. కొవిడ్ బారి నుంచి నిన్న 1,825 మంది రికవరీ అయ్యారు. ఇక తెలంగాణలో (Telangana) ప్రస్తుతం 26,633 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. 


కొవిడ్ వల్ల తెలంగాణలో ఇప్పటి వరకు మొత్తం 4,067 మంది మృత్యువాతపడ్డారు. ప్రస్తుతం తెలంగాణలో రికవరీ రేటు 95.75శాతంగా ఉంది. ఇక మరణాల రేటు 0.56 శాతంగా ఉంది.



Also Read : Kidnap drama: షార్ట్​ఫిల్మ్​​ ఫండ్​ కోసం యువకుడి కిడ్నాప్​ డ్రామా- చివరకు ఏమైదంటే..!


ఇక కొత్తగా తేలిన 4,207 కొవిడ్ పాజిటివ్‌ కేసుల్లో.. అత్యధికంగా జీహెచ్‌ఎంసీలో 1,645 కేసులు నమోదు అయ్యాయి. మేడ్చల్‌ మల్కాజ్‌గిరిలో 380 కొవిడ్ కేసలుఉ, రంగారెడ్డిలో 366 కరోనా (Corona) కేసులు, హనుమకొండలో 154 కేసులు, సంగారెడ్డిలో 107 కేసులు రికార్డయ్యాయి.


Also Read : PPF Investment: నెలకు రూ.5 వేలే.. రూ.16 లక్షలు పొందవచ్చు.. ఎలాగో తెలుసుకోండి


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి