Fake news alert | అదొక ఫేక్ న్యూస్.. మోసపోవద్దు: నిరుద్యోగులకు డీజీపీ సూచన
తెలంగాణలో రాష్ట్రవ్యాప్తంగా హోంగార్డుల నియామకాలు(Home guards recruitment) చేపట్టబోతున్నారంటూ సోషల్ మీడియాలో(Social media) వస్తున్న వార్తలు అవాస్తవమని తెలంగాణ రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డి(TS DGP Mahender Reddy) స్పష్టంచేశారు.
హైదరాబాద్: తెలంగాణలో రాష్ట్రవ్యాప్తంగా హోంగార్డుల నియామకాలు(Home guards recruitment) చేపట్టబోతున్నారంటూ సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు అవాస్తవమని తెలంగాణ రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డి(TS DGP Mahender Reddy) స్పష్టంచేశారు. హోంగార్డుల నియామకాలకు సంబంధించి ఏదైనా షెడ్యూల్ ఉన్నట్టయితే.. తామే ముందుగా ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా వెల్లడిస్తామని.. అలాగే పోలీస్ అధికారిక సోషల్ మీడియా ఖాతాల ద్వారా నోటిఫికేషన్ వివరాలు తెలియజేస్తామని డీజీపీ తేల్చిచెప్పారు. అంతేకానీ సోషల్ మీడియాలో వస్తున్న తప్పుడు వార్తలు నమ్మి బ్రోకర్ల చేతిలో నిరుద్యోగులు మోసపోవద్దని సూచించారు.
[[{"fid":"180418","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]
హోంగార్డుల నియామకాలపై సోషల్ మీడియాలో వస్తోన్న వార్తలపై తొలుత హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీకుమార్(Hyderabad CP Anjani Kumar) స్పందిస్తూ ఓ ట్వీట్ చేశారు. ఈ విషయంలో సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని కమిషనర్ కొట్టిపారేయగా.. సీపీ చేసిన ప్రకటనను సమర్థిస్తూ డీజీపి సైతం ట్విటర్ ద్వారా స్పందించారు. బ్రోకర్ల మాటలు నమ్మి మోసపోవద్దని డీజీపి ట్విటర్ ద్వారా విజ్ఞప్తిచేశారు.