Telangana Digital Media: పబ్లిక్ రిలేషన్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఎక్సలెన్స్ (PRCI) అవార్డుల్లో తెలంగాణ డిజిటల్ మీడియా విభాగం సత్తా చాటింది. ఐదు విభాగాలలో అవార్డులు గెలుచుకుంది. తెలంగాణ డిజిటల్ మీడియా డైరెక్టర్ దిలీప్ కొణతంకు సోషల్ మీడియా పర్సన్ ఆఫ్ ది ఇయర్ అవార్డు వరించింది. అదే విధంగా మరో నాలుగు విభాగాల్లో ఐటీ శాఖ తెలంగాణ డిజిటల్ మీడియాకు అవార్డులు వచ్చాయి. న్యూఢిల్లీలో సెప్టెంబర్ 21, 22వ తేదీల్లో జరిగిన 17వ గ్లోబల్ కమ్యూనికేషన్ కాంక్లేవ్‌లో ఈ అవార్డులను ప్రదానం చేశారు. మాజీ కేంద్ర మంత్రి ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ చేతుల మీదుగా అవార్డుల ప్రదానోత్సవం జరిగింది. నేషనల్, ఇంటర్నేషనల్ సామాజిక మాధ్యమాల్లో విశేష కృషి చేసిన వ్యక్తులకు ఈ అవార్డును పీఆర్సీఐ అందజేస్తుంది. డైరెక్టర్ దిలీప్ కొణతంకు సోషల్ మీడియా పర్సన్ ఆఫ్ ది ఇయర్ అవార్డును ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ అందజేశారు.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ అవార్డుతో పాటు డిజిటల్ మీడియా విభాగం 2023 సంవత్సరానికి గాను మరో నాలుగు పీఆర్సీఐ ఎక్సలెన్స్ అవార్డులను గెలుచుకుంది.


==> సోషల్ మీడియా ఉత్తమ వినియోగం అవార్డు


==> ఉత్తమ వార్షిక నివేదిక అవార్డు (తెలంగాణ ఐటీ శాఖ వార్షిక నివేదిక 2022-23)


==> ప్రజా సేవల ప్రకటనల అవార్డు (“మన ట్యాంక్‌బండ్‌ని శుభ్రంగా, అందంగా ఉంచుకుందాం” వీడియోకి)


==> ఉత్తమ ప్రభుత్వ కమ్యూనికేషన్ ఫిల్మ్స్ ("కాళేశ్వరం -తెలంగాణ జల విప్లవం" వీడియోకి)


తెలంగాణ డిజిటల్ మీడియా విభాగం తరపున సహాయ సంచాలకులు, డిజిటల్ మీడియా ముడుంబై మాధవ్, డిజిటల్ మీడియా కన్సల్టెంట్ నరేందర్ గుండ్రెడ్డి ఈ అవార్డులు అందుకున్నారు. ఐటీ శాఖకు చెందిన డిజిటల్ మీడియా విభాగం జూన్ 2014లో ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించిన సమాచారాన్ని, సేవలను డిజిటల్ మధ్యమాలలో పౌరులకు చేరవేయడం ఈ విభాగం ప్రధాన బాధ్యత. సామాజిక మధ్యమాల ఖాతాల సృష్టి, నిర్వహణ, వెబ్‌సైట్‌లు/పోర్టల్‌ల రూపకల్పన, అభివృద్ధి, నిర్వహణ, ఓపెన్ గవర్నమెంట్ డేటా, కంటెంట్ స్థానికీకరణ, ఫ్యాక్ట్ చెక్, తెలంగాణ డిజిటల్ రిపాజిటరీ కార్యక్రమాల అమలు చేయడం డిజిటల్ మీడియా విభాగం విధులు. సాంకేతిక సంస్థల నిపుణులచే ప్రభుత్వ అధికారులు, సిబ్బందికి సామాజిక మధ్యమాలపై శిక్షణా కార్యక్రమాలను డిజిటల్ మీడియా విభాగం నిర్వహిస్తుంది.


Also Read: Bajaj Auto CNG Bikes: సూపర్ న్యూస్ చెప్పిన బజాజ్.. త్వరలో మార్కెట్‌లోకి సీఎన్‌జీ బైక్‌లు..!    


Also Read: Realme C53 Price: ఫ్లిఫ్‌కార్ట్‌లో realme C53 మొబైల్స్‌పై మీ కోసం స్పెషల్‌ డిస్కౌంట్‌..రూ. 5,900కే పొందండి!


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook