TG DSC 2024 Posting Counselling: తెలంగాణలో డీఎస్సీ 2024 ద్వారా కొత్తగా నియమితులైన ఉపాధ్యాయులకు నిరాశ ఎదురైంది. సాంకేతిక కారణాలతో ఉపాధ్యాయుల పోస్టింగ్ కౌన్సిలింగ్ వాయిదా పడింది. తిరిగి ఎప్పుడనేది త్వరలో ప్రకటిస్తామని తెలంగాణ విద్యా శాఖ తెలిపింది. తెలంగాణ విద్యా శాఖ తీసుకున్న నిర్ణయంతో కొత్తగా ఎంపికైన అభ్యర్దుల్లో నిరాశ నెలకొంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వాస్తవానికి డీఎస్సీలో ఎంపికైన ఉపాధ్యాయుల కౌన్సిలింగ్  ప్రారంభం కావల్సి ఉంది. అంటే ఎవరికి ఏ జిల్లాలో ఎక్కడెక్కడ పోస్టింగ్ అనేది నిర్ణయం కావల్సి ఉంది. దీనికోసం చేపట్టాల్సిన కౌన్సిలింగ్‌ను విద్యా శాఖ వాయిదా వేసింది. రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి డీఎస్సీలో సెలెక్ట్ అయిన ఉపాధ్యాయల కౌన్సిలింగ్ డేటా లభించకపోవడంతో వాయిదా వేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ కౌన్సిలింగ్ తిరిగి రేపు ప్రారంభం కావచ్చని అనుకుంటున్నా..విద్యా శాఖ మాత్రం తదుపరి తేదీలు త్వరలో ప్రకటిస్తామని తెలిపింది. డీఎస్సీ 2024 పోస్టింగులు నిలిపివేయాల్సిందిగా ఈ మేరకు రాష్ట్రంలోని డీఈవోలు అందరికీ ఆదేశాలు అందాయి. కొత్తగా ఎంపికైన టీచర్ల వివరాలు తీసుకుని వాటిని తమకు పంపించాల్సిందిగా విద్యా శాఖ కోరింది. తదుపరి కౌన్సిలింగ్ తేదీ, సమయం వివరాలు మెస్సేజ్ ద్వారా పంపిస్తామని సూచించింది. 


రాష్ట్రవ్యాప్తంగా డీఎస్సీ 2024 ద్వారా 10,600 మంది ఎంపికయ్యారు. వీరందరికీ ఇప్పటికే నియామక పత్రాలు అందాయి. ఆయా జిల్లాల కలెక్టరేట్లలో ఇవాళ పోస్టింగులకు సంబంధించి కౌన్సిలింగ్ ప్రక్రియ జరగాల్సి ఉంది. కానీ సాంకేతిక కారణాలతో, డేటా పూర్తిగా అందకపోవడంతో వాయిదా వేశారు. 


Also read: IMD Red Alert: ఈ జిల్లాల్లో అతి భారీ వర్షాలు, ఎవరూ బయటకు రావద్దని హెచ్చరిక



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.