Telangana EAMCET: తెలంగాణలో భారీ వర్షాలు కంటిన్యూ అవుతున్నాయి. ఐదు రోజులుగా కుండపోతగా వర్షాలు కురుస్తున్నాయి. తాజాగా మరో మూడు రోజులు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. దీంతో ఈనెల 14,15 తేదీలలో జరిగే ఎంసెట్
(TS EAMCET) పైనా భారీ వర్షాల ప్రభావం పడింది. వర్షాలు తగ్గే సూచనలు కనిపించకపోవడంతో ఎంసెట్ వాయిదా పడే అవకాశాలు ఉన్నాయి. నిజానికి ఎంసెట్ (TS EAMCET) వాయిదా పడే అవకాశాలు ఉన్నాయని రెండు రోజుల క్రితమే వార్తలు వచ్చాయి. అయితే బుధవారం జరగాల్సిన ఈసెట్ పరీక్షను వాయిదా వేసిన ఉన్నత విద్యామండలి.. ఎంసెట్ ను యథాతథంగా నిర్వహిస్తామని ప్రకటించింది. భారీ వర్షాలు వచ్చినా విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకున్నామని ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ లింబ్రాది తెలిపారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఉన్నతవిద్యామండలి క్లారిటీ ఇవ్వడంతో ఎంసెట్ షెడ్యూల్ ప్రకారమే జరుగుతుందని విద్యార్థులు భావించారు. షెడ్యూల్ ప్రకారం జులై 14, 15 తేదీల్లో అగ్రికల్చర్‌, మెడిసన్‌, 18, 19, 20 వరకు ఇంజినీరింగ్‌ ఎంసెట్‌(TS EAMCET) పరీక్షలు జరగాల్సి ఉంది. అయితే వర్షాలు తగ్గకపోవడం.. శుక్రవారం వరకు వర్షాలు కంటిన్యూ అవుతాయన్న వాతావరణ శాఖ తాజా హెచ్చరికలతో ఉన్నత విద్యామండలి మళ్లీ పునరాలోచనలో పడింది. భారీ వర్షాలు కురిస్తే ఎంసెట్ నిర్వహణ కష్టమని భావిస్తున్న ఉన్నత విద్యామండలి.. ఈనెల 14,15 తేదీల్లో జరగనున్న ఎంసెట్ ను వాయిదా వేయాలని దాదాపుగా నిర్ణయం తీసుకుందని తెలుస్తోంది. ప్రభుత్వంతో చర్చించాకా దీనిపై అధికారిక ప్రకటన చేయనుందని సమాచారం.


ఐదు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో పలు పలు జిల్లాల్లో ఇప్పటికీ ఎంసెట్ (TS EAMCET) ఏర్పాట్లు మొదలు కాలేదు. ఆన్ లైన్ లో జరిగే పరీక్ష కావడంతో వర్షం వస్తే ఇంటర్ నెట్ సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుందని అధికారులు భయపడుతున్నారు. పలు జిల్లాలో ఎంసెట్ సెంటర్లు జలమయం అయ్యాయని తెలుస్తోంది. ఏజెన్సీ ప్రాంతాలకు రవాణా సౌకర్యాలు నిలిచిపోయాయి. అక్కడి నుంచి వచ్చే  విద్యార్థులకు కష్టంగా మారనుంది. ఇవన్ని పరిశీలించాకే ఎంసెట్ ను వాయిదా వేసే యోచనకు విద్యాశాఖ అధికారులు వచ్చారని తెలుస్తోంది. భారీ వర్షాల ప్రభావంతో ఇప్పటికే తెలంగాణలో విద్యా సంస్థలకు సెలవులు ఇచ్చారు. యూనివర్సిటీల్లో పరీక్షలు సైతం రద్దు అయ్యాయి. తెలంగాణ ఎంసెట్ కు ఈ సంవత్సరం భారీ స్పందన వచ్చింది. ఇంజనీరింగ్ పరీక్షకు లక్షా 71 వేల 500 దరఖాస్తులు.. అగ్రికల్చర్ కు 94 వేల 047 దరఖాస్తులు వచ్చాయి. 


Read also: Hyderabad Rains: హైదరాబాద్‌కు మరోమారు భారీ వర్ష సూచన..అప్రమత్తమైన జీహెచ్‌ఎంసీ..!


Read also: AP Flood: తెలుగు రాష్ట్రాల్లో నిండుకుండలా ప్రాజెక్ట్‌లు..ప్రమాద హెచ్చరికలు జారీ..!



స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook