Telangana EAMCET 2022: తెలంగాణ రాష్ట్రలో కుండపోత వర్షాలు కొనసాగుతున్నాయి. వారం రోజులైనా వరుణుడు శాంతించడం లేదు. మరో మూడు రోజులు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. గురు, శుక్రవారాల్లో పలు జిల్లాకు రెడ్ అలెర్ట్ జారీ చేసింది. ఈనెల 15వరకు రాష్ట్రమంతా వర్షాలు కురుస్తాయని, పలు ప్రాంతాల్లో అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. దీంతో ఈనెల 14,15 తేదీలలో జరిగాల్సిన ఎంసెట్ (TS EAMCET)పై  భారీ వర్షాల ప్రభావం పడింది. షెడ్యూల్ ప్రకారమే తెలంగాణ ఎంసెట్ పరీక్షలు జరుగుతాయని  ప్రకటించిన  అధికారులు.. వాయిదా వేస్తున్నట్లు తాజాగా ప్రకటించారు. భారీ వర్షాల కారణంగా రేపు మరియు ఎల్లుండి జరగాల్సిన అగ్రికల్చర్ పరీక్షలు వాయిదా వేస్తున్నట్లు.. జులై 18, 19, 20 న జరిగే ఎంసెట్ పరీక్షలు యధావిధిగా నిర్వహిస్తున్నట్లు తెలంగాణ ఉన్నత విద్యామండలి ప్రకటించింది. [[{"fid":"237750","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

షెడ్యూల్ ప్రకారం జులై 14, 15 తేదీల్లో ఎంసెట్ (TS EAMCET)అగ్రికల్చర్‌, మెడిసన్‌, 18, 19, 20 వరకు ఇంజినీరింగ్‌ ఎంసెట్‌ పరీక్షలు జరగాల్సి ఉంది.వారం రోజులుగా కురుస్తున్న ఎడతెరపి లేని వర్షాలతో పలు జిల్లాల్లో ఇప్పటికీ ఎంసెట్  ఏర్పాట్లు మొదలు కాలేదు. ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, ఖమ్మం, కరీంనగర్ జిల్లాల్లో ఎంసెట్ కేంద్రాలు కూడా నీట మునిగాయి.  ఏజెన్సీ ప్రాంతాలకు రవాణా సౌకర్యాలు పూర్తిగా నిలిచిపోయాయి. అక్కడి నుంచి వచ్చే  విద్యార్థులకు కష్టంగా మారనుంది. దీంతో ఎంసెట్ ను వాయిదా వేయాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఇవన్ని పరిశీలించాకే ఎంసెట్ (TS EAMCET)ను వాయిదా వేయాలని ఉన్నత విద్యామండలి నిర్ణయించిందని తెలుస్తోంది.  భారీ వర్షాలతో గత మూడు రోజులుగా తెలంగాణలోవిద్యా సంస్థలు మూతపడ్డాయి. యూనివర్సిటీల్లో పరీక్షలు కూడా రద్దయ్యాయి.


ఎంసెట్(TS EAMCET) వాయిదా పడే అవకాశాలు ఉన్నాయని మూడు  రోజుల క్రితమే వార్తలు వచ్చాయి. అయితే బుధవారం జరగాల్సిన ఈసెట్ పరీక్షను వాయిదా వేసిన ఉన్నత విద్యామండలి.. ఎంసెట్ ను కూడా వాయిదా వేస్తున్నట్లు తాజాగా ప్రకటించారు.  ఉన్నతవిద్యామండలి క్లారిటీ ఇవ్వడంతో ఎంసెట్ షెడ్యూల్ ప్రకారమే జరుగుతుందని విద్యార్థులు భావించారు. అయితే వర్షాలు తగ్గకపోవడంతో ఉన్నత విద్యామండలి ఎంసెట్ నిర్వహణపై వెనక్కి తగ్గింది.  తెలంగాణ ఎంసెట్ కు ఈసారి ఇంజనీరింగ్ పరీక్షకు 1,17,500 దరఖాస్తులు.. అగ్రికల్చర్ కు 94,047 దరఖాస్తులు వచ్చాయి.


Read also: Telangana Elections: తెలంగాణలో ముందస్తు ఎన్నికలు ఖాయమా? కేసీఆర్ డేట్ ఫిక్స్ చేసేశారా


Read also: Telangana Rain ALERT: గోదావరి ఉగ్రరూపం.. పోలవరం ప్రాజెక్టుకు గండం? భద్రాచలంలో రెండో ప్రమాద హెచ్చరిక 



స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి

Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook