Telangana EAMCET application last date extended హైదరాబాద్: తెలంగాణ ఎంసెట్ పరీక్షకు దరఖాస్తు గడువును మరోసారి పొడిగిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. ఈనెల 24 వరకు ఎంసెట్ పరీక్షకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పిస్తున్నట్టు ఎంసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ గోవర్ధన్ ప్రకటించారు. ప్రస్తుతానికి అందిన దరఖాస్తుల ప్రకారం ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్ష కోసం 2,25,125 మంది దరఖాస్తు చేసుకోగా, అగ్రికల్చర్ బీఎస్సీ కోసం 75,519 మంది దరఖాస్తు చేసుకున్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also read: TS Entrance Exams 2021 Postponed: తెలంగాణలో ఎంట్రన్స్ ఎగ్జామ్స్ వాయిదాకు ఉన్నత విద్యా మండలి నిర్ణయం 
ముందుగా ప్రకటించిన షెడ్యూల్స్ ప్రకారం జులై 5 నుంచి 9 వరకు జరగాల్సి ఉన్న మూడు ఎంట్రన్స్ టెస్టులను ఉన్నత విద్యామండలి వాయిదా వేసిన సంగతి తెలిసిందే. కరోనావైరస్ (Corona cases in Telangana) వ్యాప్తి నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పిన ఎంసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ గోవర్ధన్.. ఈ గడువు పొడిగింపు వల్ల ఇప్పటివరకు దరఖాస్తు చేసుకోలేకపోయిన వారికి సైతం అవకాశం లభిస్తుందని అన్నారు.


Also read : Summer holidays: తెలంగాణలో సమ్మర్ హాలీడేస్ పొడిగింపు


Also read: TS inter second year exams: ఇంటర్ సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ రద్దుపై ఉత్తర్వులు, Results పైనే కసరత్తు