తెలంగాణలో పదవ తరగతి పరీక్షలు ఏప్రిల్ 3 నుంచి జరగనున్నాయి. ఈ క్రమంలో తెలంగాణ విద్యాశాఖ గుడ్‌న్యూస్ అందించింది. ప్రశాపత్రంలో ఛాయిస్ పెంచింది. ఆ ఛాయిస్ ఎలా ఉంటుంది, గతంలో ఉన్నదేంటనేది తెలుసుకుందాం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

పదవ తరగతి పరీక్షల్లో మొన్నటి వరకూ ఇంటర్నల్ ఛాయిస్ ఉండేది. అంటే ఏ లేదా బీ అనే రెండు ప్రశ్నలిచ్చి..ఏదో ఒకదానికి జవాబు రాయాల్సిన పరిస్థితి ఉండేది. దీనిపై పెద్దఎత్తున విమర్శలు వచ్చాయి. కరోనా మహమ్మారి కారణంగా ప్రత్యక్ష చదువుకు దూరమై..సామర్ధ్యం తగ్గడంతో పరీక్ష విధానంలో మార్పు చేయాలని..ఛాయిస్ పెంచాలని ఉపాధ్యాయ సంఘాలు కోరాయి. దాంతో ఇంటర్నల్ ఛాయిస్ విధానం తీసి..కొత్తగా ఛాయిస్ కల్పించింది. 


దీని ప్రకారం ఆరు ప్రశ్నల్లో నాలుగింటికి సమాధానం రాస్తే సరిపోతుంది. మిగిలిన రెండు సెక్షన్లలో ఒక్కొక్క ప్రశ్నకు మార్కుల కేటాయింపు ఉంటుంది. అయితే ఈ మార్పు తెలుగు, ఇంగ్లీషు, హిందీ భాషలకు వర్తించదు. 2023-24 విద్యా సంవత్సరానికి మాత్రమే వర్తిస్తాయని తెలిపింది. 


కొత్త విధానం ప్రకారం వ్యాసరూప ప్రశ్నలు 6 ఇచ్చి 4 రాయమంటారు. మొత్తం 24 మార్కులుంటుంది. లఘు ప్రశ్నలు 6 ఇచ్చి 6 రాయాల్సి ఉంటుంది. 24 మార్కులుంటాయి. అతి లఘు ప్రశ్నలు 6 రాయాలి. 12 మార్కులుంటాయి. మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలు 20 ఉంటాయి. 20 మార్కులు కేటాయిస్తారు


Also read: Harish Rao: తుమ్మల ఇంటికి హరీష్ రావు.. 'సండ్ర' వెంట పెట్టుకుని మరీ?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook