హైదరాబాద్ : మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల ఫలితాలు వెలువడిన కొద్దీ రోజుల్లోనే, అవి మరవకముందే రాష్ట్రంలో ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలకు ఎన్నికల నోటిఫికేషన్ వెలువడింది. ఈ మేరకు రాష్ట్ర సహకార ఎన్నికల సంస్థ ఎన్నికలు జరిగే జాబితాను వెలువరించింది. ఫిబ్రవరి 3వ తేదీన ఎన్నికల అధికారి సహకార సంఘాల రైతులకు ఫారం 1 ద్వారా నోటీసును విడుదల చేస్తారని తెలిపారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఫిబ్రవరి 6, 7, 8 తేదీల్లో మూడు రోజుల పాటు సహకార ఎన్నికల్లో పోటీచేసే రైతుల నుంచి ఫారం 2 నామినేషన్లను స్వీకరిస్తారని, ఫిబ్రవరి 9వ తేదీన నామినేషన్లను వడపోత కార్యక్రమాన్ని ఎన్నికల అధికారి చేపడతారని తెలిపారు. ఫిబ్రవరి 10వ తేదీన నామినేషన్ వేసిన వారు ఉపసంహరించుకునే ప్రక్రియతో పాటు పోటీల్లో ఉన్న అభ్యర్థులతో కూడిన తుది జాబితాను వెలువరించడంతో పాటు పోటీపడుతున్న వారికి గుర్తులను కేటాయించడం జరుగుతుందని తెలిపారు. 


ఫిబ్రవరి 15వ తేదీన ఉ. 10 గం.ల నుంచి మ. 1.00 గం.ల వరకు పోలింగ్‌ను నిర్వహించనుండగా, పోలింగ్ సమయం ముగిసిన వెంటనే అదే రోజు(ఫిబ్రవరి 15న) మధ్యాహ్నం ఓట్ల లెక్కింపును చేపడతారు. ఫిబ్రవరి 15వ తేదీనే ఎన్నికల ఫలితాలను వెలువడుతాయని ఎన్నికల నిర్వహణ అధికారులు తెలిపారు.  ఎన్నికల ఫలితాలు వచ్చిన మూడు రోజుల్లో కార్యవర్గాన్ని ఎన్నికోవాల్సి ఉంటుందని తెలిపారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..