సాధారణంగా ఎన్నికల ప్రక్రియ పూర్తికాగానే గెలుపు విషయంలో నేతలు ఓ అంచనాకు వస్తారు..నియోజకవర్గ స్థాయి పరిస్థితులతో పాటు ఎగ్జిట్ పోల్ ఫలితాల ఆధారంగా విజయం ఎవరిదో  కౌంటింగ్ ప్రక్రియకు ముందే ఓ అంచనా ఏర్పాడుతుంది. కానీ ఈ సారి పరిస్థితి భిన్నం.. పోలింగ్ ముగిసినా ప్రజల నాడి ఎటువైపు ఉందో అర్థం కానీ స్థితి. ఎలా స్పందించాలో నేతల్లో అయోమయ పరిస్థితి ఏర్పడింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

దీనికి ప్రధాన కారణం ఎగ్జిట్ పోల్స్ సర్వే ఫలితాలే ని చెప్పవచ్చు. ప్రజల అభిప్రాయాన్ని పసిగట్టడంలో విశేష అనుభవం ఉన్న జాతీయ మీడియా సంస్థలన్నీ టీఆర్ఎస్ విజయం ఖాయమని కోడై కూస్తున్నాయి. ఆ పార్టీ పూర్తి స్థాయి మెజార్టీ సాధించి తిరిగి అధికారం చేపడుతందని బల్లగుద్ది చెబుతున్నాయి.. అయితే  ప్రజల నాడి విషయంలో ఆంధ్రా ఆక్టోపస్ లడపాటి జోక్యం మాత్రం మరోలా ఉంది. టీఆర్ఎస్ 25 నుంచి 45 స్థానాల మధ్య ఉంటుందని.. కేసీఆర్ ఓటమి ఖామయని ఆయన సర్వే తేల్చింది. 


ఒకవైపు జాతీయ దిగ్గజ మీడియా సంస్థల మాటల్ని నమ్మాలా..ప్రజలనాడి పట్టుకోవడంతో దిట్టగా పేరున్న లగడపాటి సర్వేని నమ్మాలా అని నేతల డైలమాలో ఉన్నారు. పైకి మాత్రం అటూ మహాకూటమి నేతలు..ఇటు గులాబీదళం ఎవరికి వారు గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నప్పటకీ లోపల మాత్రం ఇరువురికి ఓటమి భయం పట్టుకుంది. ఈ ఉత్కంఠత తెరపడాలంటే మరో 24 గంటలు వేచిచూడక తప్పదు మరి.