Telangana Electricity: తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయానికి ఉచిత విద్యుత్ సరఫరాను 7 గంటలకు కుదించినట్లు విద్యుత్ పంపిణీ సంస్థ గురువారం తెలిపింది. వ్యవసాయం కోసం గ్రామాల్లో రోజుకు 7 గంటలు ఉచిత త్రీఫేజ్ విద్యుత్ సరఫరా జరుగుతోందని.. రాత్రి 12 నుంచి ఉదయం 8 గంటల వరకు కేవలం సింగిల్‌ ఫేజ్‌ విద్యుత్‌ సరఫరా చేయాలని నిర్ణయించినట్లు ఆదేశాలు ఇచ్చింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అయితే తెలంగాణలోని జిల్లాల వారీగా 7 గంటల త్రీఫేజ్‌ విద్యుత్‌ సరఫరా షెడ్యూల్‌ను కచ్చితంగా పాటించాలని ఆ ఆదేశాల్లో పేర్కొన్నారు. మూమూలు రోజుల్లో సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల మధ్య కోత విధిస్తున్నారు. అయితే రాష్ట్రంలో విద్యుత్ కోతలపై టీఎస్ ట్రాన్స్ కో, జెన్ కో సీఎండీ ప్రభాకర్ రావు స్పందించారు. 


విద్యుత్ సరఫరాకు ఎలాంటి అంతరాయం లేదు!


వ్యవసాయానికి విద్యుత్ కోత విధిస్తున్నారన్న వార్త విన్న రైతులు ఆందోళన చెందారు. దీంతో ఆ వార్తలపై తెలంగాణ ట్రాన్స్ కో, జెన్ కో సీఎండీ ప్రభాకర్ రావు స్పందించారు. గురువారం (ఏప్రిల్ 14) రాత్రి కొన్ని ప్రాంతాల్లో అనివార్య కారణాల వల్ల వ్యవసాయ రంగానికి విద్యుత్ సరఫరాలో అంతరాయం కలిగింది. ఎన్ పి డి సీఎల్ సంస్థలో నిన్న కొంత సమాచార లోపం తో వ్యవసాయ రంగం కు విద్యుత్ సరఫరా లో అంతరాయం ఏర్పడిందని" అని ప్రభాకర్ రావు తెలిపారు. 


"కానీ, నేటి నుంచి రాష్ట్ర రైతాంగానికి 24 గంటల ఉచిత నాణ్యమైన విద్యుత్ సరఫరా యథావిధిగా కొనసాగిస్తాం. రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ కూడా విద్యుత్ సరఫరాకు అంతరాయం ఉండదు. రైతులు ఎవరూ ఆందోళన చెందల్సిన అవసరం లేదు. ఇన్నాళ్లు వ్యవసాయానికి 24 గంటల విద్యుత్ సరఫరా ఎలా ఉందో దాన్ని కొనసాగిస్తాం" అని టీస్ ట్రాన్స్ కో, జెన్ కో సీఎండీ ప్రభాకర్ రావు స్పష్టం చేశారు.  


Also Read: Hyderabad: పారిపోయేందుకు యత్నించిన మూడో తరగతి బాలికలు... కారణమేంటో తెలిస్తే షాక్ అవాల్సిందే...


Also Read: Hyderabad: శ్రీరామ నవమి ఎఫెక్ట్... హైదరాబాద్‌లో మద్యం షాపులు బంద్...


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook