గతంలో ఎన్నుడూ లేని విధంగా పోలింగ్ శాతంపై ఉత్కంతఠ నెలకొంది. కారణం పోలింగ్ శాతం పెరిగితే ప్రతిపక్ష పార్టీకి అనుకూలంగా ఉంటుందని.. తగ్గితే అధికారపక్షానికి అనుకూలంగా ఉంటుందని చాలా మంది విశ్లేషకులు అంచనా వేశారు. గతంలో పోలింగ్ పై అంతగా శ్రద్ధ వహించే వారు.. ఫలితాలు వచ్చాకే గెలుపు, ఓటుములపై క్లారిటీ వచ్చేది. ఈ  నేపథ్యంలో పోలింగ్ శాతంపై రాజకీయవర్గాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి.


ప్రస్తుతం పోలింగ్ శాతం గతం ఎన్నికల శాతానికి అటూ ఇటూ గా దోబూచులాడుతోంది. గతంలో 68.5 శాతం పోలింగ్ నమోదు కాగా.. ప్రస్తుతం జిల్లాల వారీగా తీసుకున్న సమాచారం ప్రకారం ఓటింగ్ శాతం 65 శాతానికి దగ్గర్లలో ఉంది..ఇంకా క్యూలైన్లో ఉన్నవారి ఓట్లు కూడా పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంది. ఇవి మహా అయితే 2 నుంచి 3 శాతం పెరిగే అవకాశముంది. ఈ లెక్కన చూస్తే గతంలో వచ్చిన ఫిగర్ కు కాస్త అటూ ఇటూగా పోలింగ్ శాతం నమోదు అయ్యే అవకాశముందే కానీ భారీ తేడాతో పోలింగ్ నమోదు అయ్యే అవకాశం లేదంటున్నారు విశ్లేషకులు. ఈ లెక్క తేలాలంటే ఈసీ అధికారిక ప్రకటన వరకు వేచిచూడాల్సిందే.