Hyderabad Lok Sabha: మాధవీలతకు భారీ షాకిచ్చిన ఎగ్జిట్ పోల్స్.. అసద్ గెలవబోతున్నారా?
Hyderabad Lok Sabha Exit Polls: లోక్‌సభ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా హైదరాబాద్ లోక్‌సభ స్థానంపై ఆసక్తి ఉంది. అసదుద్దీన్ ఓవైసీపై బీజేపీ తరఫున మాధవీలత పోటీ చేయడం ఆసక్తికర పోరు సాగింది. మరి ఇక్కడ ఎవరు గెలుస్తారో సర్వే సంస్థలు ఇవే చెప్పాయి.
Hyderabad Lok Sabha: దేశవ్యాప్తంగా ఆసక్తికరమైన లోక్‌సభ స్థానం హైదరాబాద్. దశాబ్దాలుగా తిరుగులేని విజయంతో ఉన్న ఏఐఎంఐఎం పార్టీ అధినేత అసదుద్దీన్ ఓవైసీని ఓడించాలని బీజేపీ భారీ వ్యూహం రచించింది. అతడిపై కెంపె మాధవీలతను పోటీకి నిలపడంతో దేశవ్యాప్తంగా ఆసక్తికర చర్చ జరుగుతోంది. హైదరాబాద్ లోక్‌సభ స్థానంలో ఎవరు గెలుస్తారనే ఉత్కంఠ నెలకొంది. ఫలితాలు వెల్లడికి ముందు ఎగ్జిట్ పోల్స్ విడుదలవగా ఆసక్తికర ఫలితాలు వచ్చాయి.
మజ్లిస్ కంచుకోటగా ఉన్న హైదరాబాద్ లోక్‌సభ స్థానంలో ఈసారి ఎదురుదెబ్బ తగులుతుందనే చర్చ జరుగుతోంది. లోక్‌సభ ఎన్నికల ప్రచారం హాట్‌హాట్‌గా జరిగింది. దశాబ్దాలుగా గెలుస్తున్న అసదుద్దీన్ ఓడించాలని బీజేపీ పట్టుబట్టి ఏమాత్రం రాజకీయ అనుభవం లేని మాధవీలతను నిలబెట్టారు. అయితే ఆమె ప్రసంగం, వ్యాఖ్యలు, బాణం వేస్తూ చేసిన సన్నివేశం హైదరాబాద్ ఎన్నికపై ఆసక్తి రేపింది. ఆమె ప్రచారానికి మద్దతుగా ప్రధాని మోదీ, అమిత్ షా కూడా రంగంలోకి దిగడంతో దేశం దృష్టిని ఆకర్షించింది.
Also Read: Group 1 Hall Tickets: టీఎస్‌పీఎస్సీ గ్రూప్ 1 హాల్ టికెట్లు విడుదల.. డౌన్‌లోడ్ చేసుకోవడం ఇలా..
గట్టి పోటీ కానీ అసద్ గెలుపు?
వాస్తవంగా రాజకీయాల్లో హిందూత్వాన్ని నమ్ముకున్న బీజేపీ.. తమ వర్గాన్ని నమ్ముకున్న పార్టీ ఏఐఎంఐఎం. కమలం పార్టీతో మజ్లిస్ ఎప్పుడూ ఢీ అంటే ఢీ అంటుంది. అయితే ఈ ఎన్నికల్లో అసదుద్దీన్ ఓవైసీ ఓటమి చెందుతారని సోషల్ మీడియాలో తెగ చర్చ జరిగింది. బీజేపీ బలంతో ఆమె విజయం సాధిస్తుందా అని ఆసక్తిగా చర్చ జరిగింది. అయితే వెలువడిన ఎగ్జిట్ పోల్స్‌లో మాధవీలత తీవ్ర పోటీనిచ్చినా కూడా ఆమె ఓడిపోతుందని సంచలన ఫలితాలు ఇచ్చాయి. అత్యంత విశ్వసనీయత కలిగిన ఆరా మస్తాన్ సర్వే అసదుద్దీన్ గెలుస్తారని స్పష్టం చేసింది. మాధవీలత తీవ్ర పోటీ ఇచ్చినా కూడా విజయం మాత్ర ఏఐఎంఐఎందేనని చెప్పారు. పీపుల్స్ పల్స్, రిపబ్లిక్ టీవీ కూడా అదే విషయాన్ని చెప్పాయి.
ఏ సర్వే చూసినా..
ఇండియా టీవీ-సీఎన్‌ఎక్స్, ఏబీపీ- సీ ఓటర్, జన్ కీ బాత్, న్యూస్ 18, రిపబ్లిక్ టీవీ, పీపుల్స్ పల్స్ ఇలా ఏ సర్వే చూసినా అసదుద్దీన్ ఓవైసీ విజయం సాధిస్తారని వెల్లడించాయి. హైదరాబాద్ స్థానంలో మాధవీలత గెలుపు కష్టమేనని చెబుతున్నారు. దీనికి అనేక కారణాలు వినిపిస్తున్నాయి. ముస్లిం వర్సెస్ హిందూ మధ్య జరిగిన పోరులో మరోసారి హైదరాబాద్‌లో ఆ వర్గం ఆధిపత్యం చలాయించిందని తెలుస్తోంది. హిందూత్వాన్ని నమ్ముకున్న బీజేపీ కొంత పోటీ ఇచ్చింది కానీ విజయం వైపు మాత్రం చేరుకునే అవకాశం లేదని సర్వేలు చెబుతున్నాయి. దీనికి తోడు అధికార కాంగ్రెస్ పార్టీ పరోక్షంగా మజ్లిస్‌కు మద్దతునిచ్చిందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ ఫలితంగానే అసదుద్దీన్ పైచేయి సాధిస్తారని తెలుస్తోంది. ఏది ఏమున్నా విజేత ఎవరు అనేది? 4వ తేదీన తేలనుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిFacebook, Twitter