Fire Accident In Karimnagar: కరీంగనగర్ జిల్లాలో భారీ పేలుడు సంభవించింది. ఒక కుటుంబం మేడారంలోని సమ్మక్క సారాలమ్మను దర్శనం కోసం మేడారంకు వెళ్లారు. ఇంట్లో నుంచిపోయేటప్పుడు దేవుడి దగ్గర దీపారాధన చేసి వెళ్లారు. మరీ దీపం బట్టలకు అంటుకుందో లేదా అక్కడ ఏదైన పేలుడు పదార్థాలు దీపానికి దగ్గరగా ఉన్నాయో.. కానీ ఒక్కసారిగా ఆ ఇల్లంతా మంటలు అంటుకున్నాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 



 


చుట్టుపక్కల ఇళ్లవారు గమనిస్తున్న సమయంలోనే భారీగా పేలుడు సంభించాయి. దీంతో స్థానికులు వెంటనే ఫైర్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. వెంటనే ఫైర్ సిబ్బంది అక్కడికి చేరుకుని శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.  ఈక్రమంలో.. చుట్టుపక్కల ఇళ్ల వారు భయంతో దూరంగా పరుగులు పెట్టారు. ప్రస్తుతం ఈ ఘటన స్థానికంగా తీవ్ర ఉద్రిక్తంగా మారింది. సిలిండర్ లీకేజ్ వల్ల మంటలు అంటుకున్నట్లు అధికారులు భావిస్తున్నారు. ప్రస్తుతం ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 


Read More: Trisha: త్రిష డేరింగ్ స్టెప్.. ఆ పొలిటికల్ లీడర్ పై లీగల్ యాక్షన్‌కు దిగిన తమిళ పొన్ను..


Read More: Maida Flour: మైదా పిండిని ఎలా తయారు చేస్తారో తెలుసా? దీన్ని అధికంగా తీసుకుంటే ఏం జరుగుతుంది


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link: https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu 


Apple Link: https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook