Telangana Pending DAs: బకాయిపడిన డీఏలు ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు ప్రభుత్వానికి ఆల్టిమేటం జారీ చేశారు. ఐదు డీఏలు పెండింగ్‌లో ఉంచడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే తమ డీఏలు చెల్లించాలని కోరుతూ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ తీరుపై అసహనం వ్యక్తం చేశారు. వెంటనే బకాయిలు చెల్లించి తమకు నిజమైన దీపావళి అందించాలని డిమాండ్‌ చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వానికి కీలక విజ్ఞప్తులు చేశారు.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: KTR: గ్రూప్‌ 1 సుప్రీంకోర్టు తీర్పుపై కేటీఆర్‌ స్పందన ఇదే.. రేవంత్‌ రెడ్డికి మరో ఛాలెంజ్‌


 


సుదీర్ఘకాలంగా తమ సమస్యలు అపరిష్కృతంగా ఉండడంపై తెలంగాణ ఉద్యోగుల ఐక్య కార్యాచరణ సమితి (జేఏసీ) హైదరాబాద్‌లోని నాంప‌ల్లిలో ఉన్న డిప్యూటీ క‌లెక్ట‌ర్స్ అసోసియేష‌న్ కార్యాల‌యంలో ఆదివారం సమావేశమయ్యారు. ప్రధానంగా తమకు చెల్లించాల్సిన 5 డీఏ బ‌కాయిలు, జీఓ నం.317పై మంత్రుల ఉప సంఘం నివేదిక‌, కొత్త ఆరోగ్య పథకం అమ‌లు, సీపీఎస్ ర‌ద్దు, త‌దిత‌ర అంశాల‌పై చ‌ర్చించారు. 

Also Read: Power Bill Hike: దీపావళికి రేవంత్ రెడ్డి విద్యుత్ ఛార్జీల భారం మోపితే చూస్తూ కూర్చోలేం: కేటీఆర్


 


ఈ సందర్భంగా తెలంగాణ ఉద్యోగుల జేఏసీ చైర్మ‌న్ వి ల‌చ్చిరెడ్డి మాట్లాడుతూ.. ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న 5 డీఏల‌ను ఉద్యోగుల‌కు  ప్ర‌భుత్వం చెల్లించాలని డిమాండ్‌ చేశారు. ఈనెల 26వ తేదీన జ‌రగనున్న మంత్రివర్గ స‌మావేశంలో 5 డీఏల‌ను చెల్లించేలా నిర్ణ‌యం తీసుకోవాల‌ని కోరారు. జీఓ నం.317తో రాష్ట్రంలో ఇబ్బందులు ప‌డుతున్న ఉద్యోగులంద‌రికీ స‌త్వ‌ర‌మే న్యాయం చేసేలా చ‌ర్య‌లు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. న‌గ‌దు ర‌హిత వైద్య సేవ‌లు అందించేలా కొత్త ఆరోగ్య పథకాన్ని అమ‌లు చేయాల‌ని కోరారు.


ఉద్యోగుల న్యాయ‌బ‌ద్ద‌మైన స‌మ‌స్య‌ల‌ను ప్ర‌భుత్వం వెంట‌నే ప‌రిష్క‌రించాల‌ని ల‌చ్చిరెడ్డి డిమాండ్‌ చేశారు. ఉద్యోగుల‌కు సంబంధించిన అంశాల‌పై మంత్రివర్గం చ‌ర్చించి పెండింగ్ స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించేలా చూడాల‌న్నారు. న‌గ‌దు ర‌హిత హెల్త్ స్కీమ్‌ను అమ‌లు చేసి గ‌తంలో ఇబ్బందులు పున‌రావృతం కాకుండా చ‌ర్య‌లు చేప‌ట్టాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో సీపీఎస్ విధానాన్ని ర‌ద్దు చేసి పాత పెన్ష‌న్ విధానాన్ని అమ‌లు చేయాల‌ని కోరారు.



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.