Headmistress: రాష్ట్రంగా ఏర్పడి పదేళ్లు పూర్తవడంతో తెలంగాణతోపాటు దేశం, ప్రపంచ నలుమూలలా తెలంగాణ ప్రజలు ఆవిర్భావ వేడుకలు చేసుకున్నారు. ఇక తెలంగాణలో కోలాహలంగా ఉత్సవాలు జరిగాయి. అయితే కరీంనగర్‌లో మాత్రం ఈ ఉత్సవాలు తీవ్ర విషాదం నింపాయి. వేడుకల్లో పాల్గొని ఇంటికి తిరిగి వెళ్తున్న క్రమంలో ప్రభుత్వ ఉపాధ్యాయురాలు ఆర్టీసీ బస్సు ఢీకొని చనిపోయారు. ఈ వార్త రాష్ట్రవ్యాప్తంగా కలచివేసింది.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: Salman Khan: సల్మాన్‌ ఖాన్‌ను వెంటాడుతున్న మృత్యువు.. మరో గ్యాంగ్‌ అరెస్ట్‌


రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మండలంలోని శాత్రాజ్‌పల్లి ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు సత్తెవ్వ (52). పాఠశాలలో రాష్ట్ర ఆవిర్భావ సంబరాలు నిర్వహించారు. అప్పటి దాకా తోటి ఉపాధ్యాయులతో సరదాగా ఉన్న మనిషి ఇంటికి బయల్దేరిన కొన్ని నిమిషాల్లోనే ప్రమాదానికి గురయి మృత్యువాత పడ్డారు. కొత్తపల్లి సమీపంలోని వెలిచాల క్రాసింగ్ వద్ద ఒక్కసారిగా వేగంగా దూసుకు వచ్చిన ఆర్టీసీ బస్సు ఆమెను ఢీకొట్టింది. తీవ్ర గాయాలతో ఆమె అక్కడికక్కడే మరణించింది. ఆమె స్కూటీపై ప్రయాణిస్తుండగా ఈ సంఘటన చోటుచేసుకుంది.

Also Read: Cows Death: మూగ రోదన.. లారీలో కుక్కేయడంతో ఊపిరాడక 16 ఆవులు మృతి


స్థానికుల సమాచారంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సత్తెవ్వ మృతదేహాన్ని ప్రభుత్వ ఆస్పత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ప్రమాదానికి కారణమైన ఆర్టీసీ బస్సు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఈ ప్రమాద వార్త పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు దిగ్భ్రాంతికి గురయ్యారు. సమాచారం తెలుసుకున్న కుటుంబసభ్యులు సత్తెవ్వ మృతదేహం చూసి కన్నీరుమున్నీరుగా విలపించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. కాగా, ఆర్టీసీ బస్సులు తరచూ ప్రమాదాలకు కారణమవుతున్నాయి. మహాలక్ష్మి పేరిట ఉచిత బస్సు పథకం ప్రవేశపెట్టినప్పటి నుంచి ఆర్టీసీ డ్రైవర్లు ప్రమాదకరంగా నడుపుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. బస్సుల సంఖ్య పెంచి బస్సుల్లో ప్రయాణికుల రద్దీ తగ్గేలా చేయాలని ప్రజలు కోరుతున్నారు.



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిFacebookTwitter