Telangana Formation Day: తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం జూన్ 2న ట్రాఫిక్ ఆంక్షలు ఇవే!
Telangana Formation Day: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకకు ఏర్పాట్లు ఘనంగా జరుగుతున్నాయి. ఓ వైపు రాష్ట్ర ప్రభుత్వం మరోవైపు కేంద్ర ప్రభుత్వం పోటాపోటీగా ఆవిర్భావ దినోత్స వేడుకల నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాయి.
Telangana Formation Day: తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జూన్ 2న అత్యంత ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్న సన్నద్దమైంది. ఇటు కేంద్ర ప్రభుత్వం కూడా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని గోల్కొండ కోటలో ఘనంగా నిర్వహించనుంది. గోల్కొండ కోటపై త్రివర్ణపతాకం ఎగురవేయడంతో పాటు సాయధ బలగాల పెరేడ్ నిర్వహించనున్నారు. మరోవైపు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జూన్ 2 వతేదీన హైదరాబాద్ పరిధిలో ట్రాఫిక్ ఆంక్షలు ఇలా ఉండనున్నాయి..
వివి విగ్రహం-నెక్లెస్ రోటరీ-ఎన్టీఆర్ మార్గ్, తెలుగు తల్లి జంక్షన్‌లపై ట్రాఫిక్ అనుమతి లేదు. ఖైరతాబాద్, పంజాగుట్ట, సోమాజిగూడ నుంచి నెక్లెస్ రోటరీకు వెళ్లే ట్రాఫిక్‌ను షాదాన్-నీరంకారి మీదుగా మళ్లించారు.
నీరంకారి, చింతలబస్తి నుంచి నెక్లెస్ రోటరీకు వెళ్లే ట్రాఫిక్‌ను ఖైరతాబాద్ ఫ్లై ఓవర్‌పైకి అనుమతించరు. ఇక్బాల్ మినార్ జంక్షన్ నుంచి ట్యాంక్‌బండ్, రాణిగంజ్, లిబర్టీకు వెళ్లే ట్రాఫిక్‌ను తెలుగుతల్లి జంక్షన్, అంబేద్కర్ విగ్రహం, ట్యాంక్‌బండ్ మీదుగా అనుమతించరు. ఈ ట్రాఫిక్‌ను తెలుగు తల్లి ఫ్లై ఓవర్‌వైపు, కట్ట మైసమ్మ జంక్షన్-లోయర్ ట్యాంక్‌బండ్ వైపుకు మళ్లిస్తారు.
Also Read: Shani Vakri 2023: కేంద్ర త్రికోణ రాజయోగంతో ఈ 3 రాశులకు ఊహించని ధనం.. మీరున్నారా?
ట్యాంక్ బండ్, తెలుగు తల్లి నుంచి ఎన్టీఆర్ మార్గ్‌వైపుకు ట్రాఫిక్ అనుమతించరు. ఈ ట్రాఫిక్‌ను తెలుగు తల్లి జంక్షన్ నుంచి ఇక్బాల్ మినార్ జంక్షన్ మీదుగా మళ్లిస్తారు. ఇక బూర్గుల రామకృష్ణారావు భవన్ నుంచి ఎన్టీఆర్ మార్గ్‌కు ట్రాఫిక్ అనుమతించకుండా తెలుగు తల్లి జంక్షన్ నుంచి ఇక్బాల్ మినార్ జంక్షన్‌వైపుకు మళ్లిస్తారు.
ఖైరతాబాద్ బడా గణేష్ వీధి నుంచి ఐమాక్స్ నెక్లెస్ రోటరీ, మింట్ లేన్ ట్రాఫిక్‌ను రాజ్‌దూత్ లేన్ మీదుగా మళ్లిస్తారు. ఇక మింట్ లేన్ నుంచి బడా గణేష్ లైన్‌కు ట్రాఫిక్ అనుమతించరు. ఇదంతా మింట్ లేన్ ఎంట్రీ నుంచి తెలుగు తల్లి ఫ్లైఓవర్‌కు మళ్లిస్తారు. ఎన్టీఆర్ గార్డెన్, ఎన్టీఆర్ మార్గ్, నెక్లెస్ రోడ్, లుంబిని పార్క్‌లు జూన్ 2 మూసి వేసి ఉంటాయి.
గన్‌పార్క్ వద్ద చేపట్టనున్న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను దృష్టిలో ఉంచుకుని అసెంబ్లీ వద్ద ట్రాఫిక్ మళ్లింపు ఉంటుంది. పంజాగుట్ట, సోమాజిగూడ, అయోధ్య జంక్షన్, రవీంద్ర భారతి, ఇక్బాల్ మినార్, ఓల్డ్ సైఫాబాద్ పోలీస్ స్టేషన్, నాంపల్లి, బషీర్ బాఘ్ నుంచి గన్‌పార్క్‌కు వచ్చే ట్రాఫిక్ కాస్సేపు నిలిపివేయబడుతుంది.
Also Read: CM KCR: వేద పండితుల గౌరవ భృతి 5 వేలకు పెంపు.. అర్హత వయసు 65 ఏళ్లకు తగ్గింపు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook