KCR VS TAMILSAI: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు రాజ్ భవన్ నుంచి ఆహ్వానం వచ్చింది. ఈనెల 28న జరగనున్న అధికారిక కార్యక్రమానికి రావాలని పిలుపు అందింది. రాజ్ భవన్ ఆహ్వానం మేరకు కేసీఆర్ రాజ్ భవన్ కు వెళతారా లేదా అన్నది ఇప్పుడు ఆసక్తిగా మారింది. నిజానికి రాజ్ భవన్ లో జరిగే అధికారిక కార్యక్రమాలకు ముఖ్యమంత్రులు తప్పనిసరిగా హాజరవుతుంటారు. కాని తెలంగాణలో ప్రస్తుతం సీన్ మరోలా ఉంది.తెలంగాణ గవర్నర్ తమిళి సై సౌందరరాజన్, ముఖ్యమంత్రి కేసీఆర్ మధ్య తీవ్ర స్థాయిలో విభేదాలున్నాయి. గవర్నర్ ను కేసీఆర్ సర్కార్ వరుసగా అవమానిస్తోంది. తనకు అవమానం జరుగుతోందని గవర్నర్ తమిళి సై స్వయంగా చెప్పారు. కేంద్ర ప్రభుత్వ పెద్దలకు ఆమె ఫిర్యాదు చేశారు. అయినా సీఎం కేసీఆర్ తీరు మాత్రం మారలేదని తెలుస్తోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తెలంగాణ సీఎం కేసీఆర్ రాజ్ భవన్ వెళ్లక చాలా రోజులైంది. గవర్నర్ తమిళి సైతో ఇటీవల కాలంలో ఎక్కడా ఆయన వేదిక పంచుకోలేదు. గవర్నర్ హాజరయ్యే కార్యక్రమాలకు కేసీఆర్ దూరంగా ఉంటున్నారు. ప్రధాని మోడీ హైదరాబాద్ వస్తే కేసీఆర్ ఆయనకు స్వాగతం చెప్పలేదు. ప్రధాని పర్యటనలో గవర్నర్ తమిళి సై ఉంటారు కాబట్టే కేసీఆర్ డుమ్మా కొట్టారనే వార్తలు వచ్చాయి. అంతలా ఇద్దరి మధ్య విభేదాలు పెరిగిపోయాయని అంటున్నారు. నరసింహన్ గవర్నర్ గా ఉన్న సమయంలో తరుచూ రాజ్ భవన్ వెళ్లేవారు కేసీఆర్. పండుగులు, ఇతర ముఖ్యమైన రోజుల్లో వెళ్లి గవర్నర్ కు విషెష్ చెప్పేవారు. కాని కొన్ని నెలలుగా రాజ్ భవన్ ముఖమే చూడటం లేదు కేసీఆర్. గవర్నర్ ఇచ్చే తేనేటి విందులకు కూడా వెళ్లడం లేదు.


తాజాగా సీఎం కేసీఆర్ కు రాజ్ భవన్ నుంచి వచ్చిన ఆహ్వానం అత్యంత ముఖ్యమైనది. తెలంగాణ రాష్ట్ర హైకోర్టు నూతన ప్రధాన న్యాయమూర్తిగా  జస్టిస్‌ ఉజ్జల్‌ భుయాన్‌ నియమితులయ్యారు. ఈ నెల 28న  ఆయన  సిజేగా  ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రాజ్‌భవన్‌లో గవర్నర్ తమిళి సై.. ఉజ్జల్‌ భుయాన్‌‌తో ప్రమాణం  చేయించనున్నారు. నూతన సిజే ప్రమాణ స్వీకారానికి ముఖ్యమంత్రులు తప్పకుండా హాజరవుతుంటారు. ఈ నేపథ్యంలోనే సీజే ప్రమాణస్వీకారోత్సవానికి సీఎం కేసీఆర్ కు రాజ్ భవన్ నుంచి ఆహ్వానం వెళ్లింది. అయితే రాజ్ భవన్ ఆహ్వానంపై సీఎంవో నుంచి ఇంకా రిప్లై రాలేదని తెలుస్తోంది. రాజ్ భవన్ లో జరిగే ఈ కార్యక్రమానికి  కేసీఆర్ హాజరుకాకపోవచ్చని ప్రగతిభవన్ వర్గాలు చెబుతున్నాయి. అదే జరిగితే గవర్నర్ తో కేసీఆర్ విభేదాలు మరింత ముదరనున్నాయి. అదే సమయంలో సీజే ప్రమాణ స్వీకారానికి ముఖ్యమంత్రి హాజరు కాకపోతే దేశవ్యాప్తంగా చర్చగా మారే అవకాశం ఉంది.


హైకోర్టు ప్రధాన న్యాయమూర్తుల ప్రమాణ స్వీకారానికి ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరుకాకుండా ఉండటం చాలా తక్కువ. అనారోగ్య సమస్యలు , ఇతరత్రా ముఖ్యమైన కార్యక్రమాలు ఉంటే తప్ప సీఎంలు ఖచ్చితంగా వస్తుంటారు. గవర్నర్లతో విభేదాలు ఉన్నా రాజ్ భవన్ కార్యక్రమాలకు ముఖ్యమంత్రులు హాజరవుతారు. అలాంటిది సీజే ప్రమాణ స్వీకారానికి కేసీఆర్ వెళ్లకపోతే మాత్రం పెద్ద వివాదమే అయ్యే అవకాశాలు కన్పిస్తున్నాయి. చూడాలి మరీ ఈనెల 28న తెలంగాణ రాజ్ భవన్ లో ఏం జరగనుందో...


Read also: Target Modi: ఆ మూడు రోజులు హైదరాబాద్ గులాబీ మయం! ప్రధాని మోడీకి కేసీఆర్ మార్క్ స్వాగతం  


Read also: 7th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు జూలైలో పండగే.. ఒకేసారి మూడు కానుకలు..    



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.