Telangana: నిరుద్యోగులకు శుభవార్త, స్కూల్ ఎడ్యుకేషన్ పోస్టుల భర్తీకు గ్రీన్ సిగ్నల్
Telangana: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమీషన్ ద్వారా ఖాళీలు భర్తీ చేసేందుకు ప్రభుత్వం ఆమోదించింది. ఈ విషయాన్ని తెలంగాణ మంత్రి హరీష్ రావు ట్వీట్ ద్వారా వెల్లడించారు.
తెలంగాణ ప్రభుత్వం నుంచి నిరుద్యోగులకు గుడ్‌న్యూస్ ఇది. వివిధ శాఖల్లో ఖాళీల్ని భర్తీ చేయనుంది ప్రభుత్వం. రాష్ట్రంలోని పల్లె దవాఖానాలు, డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్‌లో ఏర్పడిన వివిధ ఖాళీల్ని భర్తీ చేయనుంది. ఈ ప్రక్రియకు సంబంధించి జీవో సైతం వెలువడింది.
రాష్ట్రంలో పల్లె దవాఖానాల్లో 1569 పోస్టుల నియామక ప్రక్రియ త్వరలో ఉంటుందని..దీంతోపాటు 1165 స్పెషలిస్టు డాక్టర్ పోస్టులకు నోటిఫికేషన్ వెలువరించనున్నామని మంత్రి హరీష్ రావు వెల్లడించారు. ఇప్పుడు డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ పరిధిలో 134 ఖాళీల్ని భర్తీ చేయనుంది ప్రభుత్వం. ఈ పోస్టుల నియామకాన్ని తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమీషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. ఈ విషయాన్ని స్వయంగా మంత్రి హరీష్ రావు ట్వీట్ చేశారు. అటు జీవో నెంబర్ 165 కూడా విడుదలైంది. స్కూల్ ఎడ్యుకేషన్ సమర్పించిన ప్రతిపాదనల్ని క్షుణ్ణంగా పరిశీలించిన తరువాత ప్రభుత్వం 134 ఖాళీల భర్తీకై అనుమతించింది.
ఈ పోస్టుల నియామక ప్రక్రియను టీపీఎస్సీ చేపట్టనుంది. టీపీఎస్సీ త్వరలో దీనికి సంబంధించిన నోటిఫికేషన్ వెలువరించనుంది. ప్రభుత్వం భర్తీ చేయనున్న ఈ పోస్టుల్లో గ్రేడ్ 1 ప్రధానోపాధ్యాయుడి పోస్టులు 24, డైట్‌లో 23 సీనియర్ లెక్చరర్ పోస్టులు, ఎస్‌సిఈఆర్‌టిలో 22 లెక్చరర్ పోస్టుల డైట్‌లో 65 ఇతర పోస్టులున్నాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook