Facial Attendance: తెలంగాణలో కొత్త నిబంధన, రేపట్నించి ఉద్యోగులకు ఫేషియల్ అటెండెన్స్
Facial Attendance: ప్రభుత్వ ఉద్యోగులకు షాక్. తెలంగాణలో ఉద్యోగులకు ప్రభుత్వం షాక్ ఇచ్చింది. విధులకు హాజయ్యే ఉద్యోగులు విధిగా ఫేషియల్ అటెండెన్స్ ఇవ్వాలని ఆదేశాలు జారీ అయ్యాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Facial Attendance: తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగుల హాజరు ప్రక్రియను మరింత కఠినం చేసింది. ఇకపై ఉద్యోగులకు ఫేషియల్ అటెండెన్స్ అమల్లోకి తీసుకురానుంది. ఇందులో భాగంగా జీవో విడుదల చేసింది. ముందుగా సెక్రటేరియట్‌లో అమలు చేసేందుకు నిర్ణయించింది.
తెలంగాణ సెక్రటేరియట్ ఉద్యోగులు ఇకపై విధిగా ఫేషియల్ అటెండెన్స్ ఇవ్వాల్సిందే. తెలంగాణ రాష్ట్రంలోని అన్ని సచివాలయాల్లో ఇకపై ఫేషియల్ అటెండెన్స్ అమల్లోకి రానుంది. ఈ ఉత్తర్వులు రేపట్నించి అంటే డిసెంబర్ 12 నుంచి అమల్లోకి వస్తాయని తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేసింది. సెక్రటేరియట్ అధికారులు, సిబ్బంది, అవుట్ సోర్సింగ్ సిబ్బంది అంతా విధిగా ఫేషియల్ రికగ్నిషన్ ద్వారా హాజరు ఇవ్వాల్సి ఉంటుంది. సెక్రటేరియల్ బిల్డింగ్ ఎంట్రీలో ఉన్న ఫేషియల్ రికగ్నిషన్ మెషీన్ల వద్ద తప్పనిసరిగా హాజరు నమోదు చేసుకోవాలి.
ఉదయం ఆఫీసుకు వచ్చేటప్పుడు తిరిగి వెళ్లేటప్పుడు విధిగా హాజరు నమోదు చేయాల్సి ఉంటుంది. ఫేషియల్ రికగ్నిషన్‌లో ఏదైనా సమస్య ఏర్పడితే సంబంధిత శాఖకు సమాచారం ఇవ్వాల్సి ఉటుంది. సచివాలయంలో పనిచేసే అన్ని శాఖ అధికారులు, సిబ్బందికి ఇది వర్తిస్తుంది. సచివాలయం నుంచి జీతాలు అందుకునే ప్రతి ఒక్కరికీ ఈ విధానం వర్తించనుంది.
Also read: Bigg Boss Telugu 8: బిగ్‌బాస్‌లో ట్విస్ట్, 10 లక్షల సూట్‌కేసుతో అవినాష్ అవుట్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.