Telangana Government - Padma Award Winners: ఈ సారి కేంద్ర ప్రభుత్వం తెలుగు రాష్ట్రాలకు పద్మ అవార్డుల్లో ప్రాధాన్యత ఇచ్చింది. అందులో తెలుగు రాష్ట్రాల్లో ఒకే ప్రాంతానికి చెందిన ఇద్దరు ప్రముఖులకు పద్మవిభూషణ్‌ అవార్డుతో గౌరవించింది. అటు వీరితో పాటు పలువురు తెలుగు ప్రముఖులకు కేంద్రం పద్మ అవార్డులతో గౌరవించింది. వీరిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వం  వెంకయ్య నాయుడు చిరంజీవి సహా పద్మ అవార్డు గ్రహీతలకు శిల్పాకళావేదికలో ఘనంగా సన్మానించింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ కార్యకమానికి ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అటు ఈ కార్యక్రమానికి మల్లు భట్టివిక్రమార్క, మంత్రులు కోమటి రెడ్డి వెంకట్‌ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి హాజరయ్యారు.


పద్మ విభూషణ్ అవార్డు గ్రహీతలు వెంకయ్య నాయుడు, సినీ నటుడు చిరంజీవితో పాటు ఇతర పద్మ అవార్డు గ్రహీతలను సన్మానించిన సీఎం, మంత్రులు.


యక్షగాన కళాకారుడు గడ్డం సమ్మయ్య 50 ఏళ్లుగా యక్షగాన కళాకారుడిగా 19 వేలకు పైగా ప్రదర్శనలు ఇచ్చారు. 1985లో నిర్వహించిన ‘కీచకవధ’ ప్రదర్శనలో కీచకుడి పాత్రలో పాపులర్ అయ్యారు. 2017లో తెలంగాణ ఆవిర్భావ పురస్కారం అందుకున్నారు. తాజాగా కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డుతో గౌరవించింది. ఇక యాదాద్రి ఆలయాన్ని సంపూర్ణంగా కృష్ణశిలతో చేపట్టిన పునర్నిర్మాణంలో డాక్టర్‌ ఆనందచారి వేలు ఉన్నారు. వీళ్లతో పాటు మిగతా పద్మ అవార్డు గ్రహీతలను తెలంగాణ ప్రభుత్వం సన్మానించింది.


Also Read Ibomma Downloading Option: ఒకే నిమిషంలో ఐ బొమ్మలో మూవీస్ డౌన్‌లోడ్ చేయడం ఎలా?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter