సమాచార కమిషన్ ఏర్పాటుకు త్రిసభ్య కమిటీ
.
హైదరాబాాద్: తెలంగాణ సమాచార కమిషన్ ఏర్పాటుకు టి.సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కమిషన్ ఏర్పాటు కోసం త్రిసభ్యకమిటీ ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కమిటీకి సీఎం కేసీఆర్ నాయకత్వం వహిస్తుండగా సభ్యులుగా డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, ప్రతిపక్ష నేత జానారెడ్డి లను నియమించారు. త్వరలోనే ఈ త్రిసభ్య కమిటీ సమావేశమై సభ్యులను ఎంపిక చేయనుంది. ఎంపిక చేసిన జాబితాను గవర్నర్ కు సిఫార్సు చేస్తే ఆయన నియామక ఉత్తర్వుల జారీ చేస్తారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో కమిషన్ కు విభజించాల్సిన అవశ్యకత ఏర్పడింది. ఈ నేపథ్యంలో తెలంగాణ సమాచార కమిషన్ ఏర్పాటు అంశంపై టి.సర్కార్ కసరత్తు ప్రారంభించింది.