Telangana Holidays: తెలంగాణలో స్కూల్స్ సెలవులు పొడిగింపు, ఎప్పటివరకంటే..
Telangana Holidays: కరోనా మహమ్మారి రోజురోజుకూ తీవ్రమవుతోంది. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోనూ కరోనా వైరస్ కొత్త కేసులు పెరుగుతున్నాయి. కోవిడ్ సంక్రమణ దృష్టిలో పెట్టుకుని తెలంగాణలో విద్యాలయాల సెలవులు పొడిగించనున్నారు.
Telangana Holidays: కరోనా మహమ్మారి రోజురోజుకూ తీవ్రమవుతోంది. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోనూ కరోనా వైరస్ కొత్త కేసులు పెరుగుతున్నాయి. కోవిడ్ సంక్రమణ దృష్టిలో పెట్టుకుని తెలంగాణలో విద్యాలయాల సెలవులు పొడిగించనున్నారు.
కరోనా థర్డ్‌వేవ్ తీవ్రత పెరుగుతోంది. దేశంలో రోజువారీ కేసులు అప్పుడే రెండున్నర లక్షలకు చేరుకున్నాయి. మరోవైపు ఒమిక్రాన్ వేరియంట్ ప్రభావం పెరుగుతోంది. కరోనా సంక్రమణను దృష్టిలో ఉంచుకుని దేశంలోని వివిధ రాష్ట్రాల్లో నైట్‌కర్ఫ్యూ (Night Curfew), ఇతర ఆంక్షలు విధించారు. కరోనా మహమ్మారి నేపధ్యంలో తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సెలవుల్ని కూడా 3-4 రోజులు ముందే ఇచ్చేశారు.
తెలంగాణలో గత 24 గంటల్లో 2 వేల 398 కొత్త కరోనా కేసులు వెలుగు చూశాయి. రాష్ట్రంలో ఇప్పటివరకూ 7 లక్షల 5 వేల 199 మంది కోవిడ్ బారిన పడగా, 6 లక్షల 79 వేల 471 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో కరోనా కారణంగా ఇప్పటి వరకూ 4 వేల 52 మంది మరణించారు. రాష్ట్రంలో గత 24 గంటల్లో 68 వేల 525 కోవిడ్ నిర్ధారణ పరీక్షలు చేశారు. కోవిడ్ కేసులు రాష్ట్రంలో పెరుగుతున్నందున..సంక్రాంతి సెలవుల్ని మరో నాలుగు రోజులు (Telangana Schools Holidays) పొడిగించవచ్చని తెలుస్తోంది. వాస్తవానికి జనవరి 17 నుంచి విద్యాలయాలు తెర్చుకోవల్సి ఉన్నాయి. అయితే ఈ నెల 20 వరకూ సెలవుల్ని పొడిగించేందుకు విద్యాశాఖ నిర్ణయించినట్టు సమాచారం.
Also read: Tesla vs Telangana: టెస్లా అధినేత ఎలాన్ మస్క్‌కు మంత్రి కేటీఆర్ ట్వీట్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook