Group Jobs: నిరుద్యోగులకు బంపరాఫర్.. అన్ని పోస్టులకు ఒకే నోటిఫికేషన్!
Group Jobs: తెలంగాణ కొలువుల జాతర కొనసాగుతోంది. వివిధ శాఖల్లో గుర్తించిన దాదావు 90 వేల ఉద్యోగాలను భర్తీ చేస్తామని అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ప్రకటించారు. అందుకు అనుగుణంగానే ఉద్యోగ నియామకాల ప్రక్రియ కొనసాగుతోంది. శాఖల వారీగా నోటిఫికేషన్లు విడుదల అవుతున్నాయి.
Group Jobs: తెలంగాణ కొలువుల జాతర కొనసాగుతోంది. వివిధ శాఖల్లో గుర్తించిన దాదావు 90 వేల ఉద్యోగాలను భర్తీ చేస్తామని అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ప్రకటించారు. అందుకు అనుగుణంగానే ఉద్యోగ నియామకాల ప్రక్రియ కొనసాగుతోంది. శాఖల వారీగా నోటిఫికేషన్లు విడుదల అవుతున్నాయి. ఇప్పటికే పోలీస్ శాఖలో ఉద్యోగాల భర్తీకి అప్లికేషన్ల ప్రక్రియ పూర్తైంది. ఇటీవలే వైద్య శాఖలో 10 వేలకు పైగా ఉద్యోగాల భర్తీకి ఆర్థిక శాఖ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో.. త్వరోలనే నోటిఫికేషన్లు రానున్నాయి.
అన్ని ఉద్యోగ ఖాళీలను వీలైనంత త్వరగా భర్తీ చేయాలని భావిస్తున్న కేసీఆర్ సర్కార్ మరో సంచలన నిర్ణయం తీసుకుందని తెలుస్తోంది. ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న అన్ని 4 పోస్టులను ఒకే నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయాలని ప్లాన్ చేస్తోంది. రాష్ట్రంలో మొత్తం 9 వేల 618 గ్రూపు4 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని గుర్తించారు. ఈ మొత్తం పోస్టులకు శాఖలతో సంబంధం లేకుండా ఒకేసారి నియామకాలు చేపట్టాలని నిర్ణయించిందని తెలుస్తోంది. ఇందుకోసం ఉన్నతాధికారులు రూపొందించిన ప్రతిపాదనలు సీఎం కేసీఆర్ దగ్గరకు చేరినట్లు చెబుతున్నారు. సీఎం నుంచి దస్త్రం తిరిగిరాగానే ఒకేసారి గ్రూప్ 4 నియామకాలకు నోటిఫికేషన్ ఇచ్చేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
గ్రూపు పోస్టుల భర్తీపై సీఎస్ సోమేశ్‌కుమార్ ఇటీవల సమీక్ష నిర్వహించారు. చాలా కాలం తర్వాత భర్తీ చేస్తున్న గ్రూపు-4 పోస్టులు భర్తీ, అభ్యర్థుల విద్యార్హతలు, ఇతర అంశాలపై చర్చించారు. పబ్లిక్ సర్వీసు కమిషన్‌తో పాటు ఇతర నియామక సంస్థల నుంచి సలహాలు, సూచనలు తీసుకున్నారు. వీటిన్నంటి ఆధారంగా ఫైల్ రూపొందించి సీఎం ఆమోదానికి పంపించారు. గ్రూపు-4 కింద భర్తీ చేయనున్న పోస్టుల్లో జూనియర్ అసిస్టెంట్లు, జూనియర్ స్టెనోలు, టైపిస్టులు, అకౌంటెంట్ తదితర కొలువులున్నాయి. అన్ని జిల్లాల కలెక్టరేట్లు, హెచ్వోడీల కింద ఖాళీలు ఉన్నాయి. ఇది ప్రభుత్వ పాలనపై తీవ్ర ప్రభావం చూపుతోంది. దీంతో ఆ పోస్టులను వీలైనంత త్వరగా భర్తీ చేయాలని అధికారులను ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారని తెలుస్తోంది. అందుకు అనుగుణంగానే అధికారులు యుద్ద ప్రాతిపదికన చర్యలు తీసుకుంటున్నారు.
Read also: Covid Cases Updates: భారత్ లో కొవిడ్ కల్లోలం.. ఒక్కరోజే 17 వేలకు పైగా కేసులు.. లాక్ డౌన్ తప్పదా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.