తెలంగాణ రాష్ట్రంలో హిజ్రాలు ఎంతమంది ఉన్నారన్న విషయంపై సమగ్ర సర్వే చేయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. టాటా ఇనిస్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ ఆధ్వర్యంలో ఈ సర్వే కార్యక్రమం జరుగుతుందని ప్రభుత్వం తెలిపింది. తెలంగాణ ఆవిర్భవించిన తర్వాత రాష్ట్రంలో 52 వేలమంది హిజ్రాలు ఉన్నట్లు సమగ్ర కుటుంబ సర్వే ద్వారా తెలిసింది.


అయితే మళ్లీ సమగ్ర సర్వే చేయించి పూర్తి వివరాలతో కూడిన నివేదిక అందితే.. చదువుకున్న హిజ్రాలకు ఉద్యోగాలు ఇప్పించి, నిరుద్యోగ, వికలాంగ హిజ్రాలకు కూడా పెన్షన్లు కూడా ఇచ్చే యోచనలో తెలంగాణ ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం. అలాగే హిజ్రాలపై జరుగుతున్న దాడులు, లైంగిక వేధింపులకు సంబంధించి కూడా చర్యలు తీసుకొనేందుకు, వాటిని కట్టడి చేసేందుకు ఒక పూర్తిస్థాయి ప్రణాళికతో తెలంగాణ ప్రభుత్వం సిద్ధం కాబోతున్నట్లు తెలుస్తోంది.